• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గని' ఫస్ట్ పంచ్ రెడీ..!

'గని' ఫస్ట్ పంచ్ రెడీ..!

By - Tupaki Desk
Update: 2021-10-05 14:43 GMT
'ఎఫ్-2' 'గద్దల కొండ గణేష్' వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రం ''గని''. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెడుతున్న మేకర్స్.. తాజాగా సరికొత్త పోస్టర్ తో పాటుగా ఓ అప్డేట్ తో ముందుకు వచ్చారు.

'గని' చిత్రం నుంచి ఫస్ట్ పంచ్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు బుధవారం సాయంత్రం 5:05 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వదిలిన పోస్టర్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాగ్ కు అనుకోని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మెగా ప్రిన్స్ ఇవ్వబోయే ఫస్ట్ పంచ్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'గని' చిత్రంలో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ తేజ్ తన మేకోవర్ మార్చేశాడు. జిమ్‌ లో కఠోరమైన వ్యాయామాలు చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇందులో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ పిక్చర్స్ - అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశారు. అబ్బూరి రవి ఈ సినిమా కోసం డైలాగ్స్ రాశారు.

ఇకపోతో వరుణ్ తేజ్ కెరీర్ లో 10వ చిత్రంగా రూపొందుతున్న 'గని' ని ముందుగా జూలై నెలాఖరున రిలీజ్ చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ మరోసారి వాయిదా వేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు రాబోయే ఫస్ట్ పంచ్ తో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Tags:    
  • Gani 
  • Varun Tej 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

Copyright @2026

Powered by Blink CMS