ఆదిపురుష్ లో గద్దలకొండ హీరో
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందబోతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ మరి కొన్ని వారాల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో దర్శకుడు నటీనటుల ఎంపిక కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాముడికి పోటీగా రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ఎంపిక చేశాడు. ఇక హీరోయిన్ మరియు ఇతర ముఖ్యమైన నటీ నటుల పాత్రలకు గాను సంప్రదింపులు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మణుడి పాత్ర కోసం తమిళ యంగ్ హీరో అథర్వ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు గద్దలకొండ గణేష్ చిత్రంతో పరిచయం అయిన అథర్వ క్యూట్ బాయ్ గా మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా కూడా అథర్వ పూర్తిగా తన కెరీర్ ను తమిళ ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఈయనకు ఆదిపురుష్ లో ఆఫర్ వచ్చినట్లుగా చెబుతున్నాడు. ప్రభాస్ కు తమ్ముడి పాత్రలో అథర్వ బాగా సెట్ అవుతాడని.. తమిళ ఇండస్ట్రీ నుండి కూడా లీడ్ రోల్స్ కోసం నటీ నటులు కావాలి కనుక ఈయన్ను ఎంపిక చేసేందుకు దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తుంది. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర చాలా కీలకమైనది. కనుక ఈ సినిమాలో కూడా అథర్వ పాత్ర చాలా కీలకంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.