• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్‌ఆర్ఆర్ నుండి బింబిసార...

ఆర్‌ఆర్ఆర్ నుండి బింబిసార వరకు.. పాపే మా ప్రాణం

By - Tupaki Desk
Update: 2022-08-08 23:30 GMT
సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీ గురించి మీమ్స్ అనేవి చాలా కామన్‌ గా వస్తూ ఉంటాయి. ఏదైనా సినిమా ప్లాప్ అయినా.. ఏదైనా సినిమా సక్సెస్ అయినా కూడా మీమ్స్ అనేవి పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ప్రతి విషయాన్ని కూడా మీమ్స్ ద్వారా చూపిస్తూ అందరి దృష్టిని సోషల్‌ మీడియాలో కొందరు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఈ మీమ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండస్ట్రీలో కూడా ఈ మీమ్ ఆలోచన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో హిట్‌ అయిన ఎక్కువ శాతం సినిమాలు ఎవరైనా ఒక పాప చుట్టూ కథలు తిరుగుతూ ఉన్నాయి. ఆ కథలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా నుండి మొదలుకుని మొన్న విడుదల అయిన బింబిసార సినిమా వరకు పలు సినిమాలు కూడా ఒక అమ్మాయి చుట్టూ కథలు తిరగడం మనం చూశాం. ఆర్ ఆర్‌ ఆర్‌ కి ముందు కూడా ఇలాంటి కాన్సెప్ట్‌ తో సినిమాలు వచ్చాయి. దాంతో పాపే మా ప్రాణం అన్నట్లుగా హీరోలు కథను ముందుకు నడిపిస్తూ స్క్రీన్‌ ప్లే ను నడిపిస్తున్నారు.

అఖండ సినిమా లో ఒక చిన్న పాప చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా లో ఆ పాప బాలయ్య కూతురు పాత్ర అనే విషయం తెల్సిందే. ఆ పాత్ర లో సదరు పాప చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆర్ ఆర్‌ ఆర్‌ లోని కొమురం భీమ్‌ పాత్ర పూర్తి గా ఒక పాప కోసం అనే విషయం తెల్సిందే. ఇక ఇటీవల విడుదల అయ్యి తమిళనాట ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న విక్రమ్‌ కూడా పాప చుట్టే కథ తిరుగుతుంది.

కమల్‌ హాసన్‌ అందులో తన మనవడిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కథ మెయిన్‌ గా ఆ చిన్న బాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక బింబిసార లో కూడా ఒక పాపను అత్యంత పవర్ ఫుల్ గా చూపించారు.

కథ ఆ పాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఎన్నో సినిమాల్లో చిన్న పిల్లలను పెట్టి.. వారి చుట్టూ కథ తిప్పడం వల్ల సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఈ మీమ్‌ ను క్రియేట్‌ చేసి ఉంటారు.
Tags:    
  • TeluguFilmIndustry 
  • KalyanRam 
  • Bimbisara 
  • Tollywood 
  • DulquerSalman 
  • SitaRamam 
  • SocialMedia 
  • Akhanda 
  • BalaKrishna 
  • RRR 
  • RamCharan 
  • NTR 
  • OTT 
  • Vikram 
  • MovieNews 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS