ముచ్చటగా మూడో సారి ఆ కాంబో!

Update: 2019-06-03 07:21 GMT
మాస్ రాజా రవితేజ ఈమధ్య తన కెరీర్లో నెమ్మదించాడు కానీ గతంలో మాస్ రాజా స్పీడు మామూలుగా ఉండేది కాదు.  ప్రతి నాలుగైదు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. విమర్శకులు మసాలా ఫార్మాట్ అని పెదవి విరుస్తూనే ఉంటారు.. ఆయన సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి అన్నట్టుగా ఉండేది పరిస్థితి.  కానీ 'బెంగాల్ టైగర్' నుంచి రవితేజ స్లో అయ్యాడు. గ్యాప్ తీసుకొని 'రాజా ది గ్రేట్' తో విజయం సాధించినా మళ్ళీ వరసగా 'టచ్ చేసి చూడు' TK 'నేల టికెట్'.. 'అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో డీలా పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నాడు.

రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా తర్వాత నటించబోయే మరో సినిమాను కూడా రవి తేజ ఫైనలైజ్ చేశాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈమధ్య ఒక ఇంట్రెస్టింగ్ కథతో మాస్ రాజాను మెప్పించాడట. ఇది మసాలా ఫార్మాట్ కథ కాదని.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా అల్లుకున్నరియలిస్టిక్ స్టొరీ అనే టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ మలినేనితో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. రవితేజతో 'డాన్ శీను' సినిమాను తెరకెక్కించి డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గోపిచంద్ మలినేని.  తర్వాత ఇద్దరూ 'బలుపు' సినిమాకు కలిసి పనిచేశారు. ఇప్పుడు రవితేజ - గోపిచంద్ మలినేని ఇది హ్యాట్రిక్ ఫిలిం కానుంది.

గోపీచంద్ మలినేని లాస్ట్ సినిమా 'విన్నర్' బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని అందుకుంది.  సాయిధరమ్ తేజ్ ఫ్లాపులలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా తర్వాత  నెక్స్ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు గోపిచంద్. ఫైనల్ గా మాస్ రాజానే మలినేనికి అవకాశం ఇచ్చాడు.  'డిస్కోరాజా' సినిమా షూట్ పూర్తయ్యే లోపే ఈ సినిమాను లాంచ్ చేస్తారని అంటున్నారు.  ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనలైజ్ చేసుకున్నారట.  త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.

   

Tags:    

Similar News