ఫస్ట్ లుక్: ఓ కుర్రాడి లైఫ్ జర్నీనే 'ప్రయాణికుడు'
ఈ మధ్యకాలంలో కొత్త ఫిల్మ్ మేకర్స్ ఎవరికీ వారే స్వతంత్ర చిత్రాలు తీసి ఓటిటి వైపు అడుగులేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆ సినిమాలు బడా నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్ల దృష్టిలో పడితే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యేందుకు ఆస్కారం లభిస్తుంది. లాక్ డౌన్ తర్వాత యంగ్ డైరెక్టర్స్ ఎంతోమంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ యంగ్ టీమ్.. టాలీవుడ్ నుండి ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా తీశారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేశారు. ఆ సినిమానే 'ప్రయాణికుడు'. గతేడాది 'అమరం అఖిలం ప్రేమ' అనే సినిమా తెరకెక్కించిన జోనతన్ ఏడ్వార్డ్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో తెరకేక్కించినట్లుగా లేదు. నిజానికి జోనతన్ షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించి సినిమా దర్శకుడుగా మారాడు. ఐతే షార్ట్ ఫిలిమ్స్ చేసే సమయంలోనే ప్రయాణికుడు అనే క్రైమ్ డ్రామా సినిమా తెరకెక్కించాడట. స్వతంత్ర చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఎం.కృష్ణ నిర్మిస్తుండగా.. ఈ సినిమాతో కృష్ణచైతన్య అనే కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంది. చూస్తుంటే ఈ సినిమా మొత్తం ఓ కుర్రాడి లైఫ్ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. పోస్టర్ ప్రకారం.. హీరో ఏదో లోతుగా ఆలోచనలో పడ్డాడు. సినిమా టైటిల్ లాగే సినిమాలో కూడా ఓ కుర్రాడి లైఫ్ సుధీర్ఘ ప్రయాణంలా చూపించనున్నారట. మరి ఇంకా ఈ సినిమాలో హీరోయిన్, రిలీజ్ డేట్ లాంటివి ఏవి రివీల్ చేయలేదు. చూడాలి మరి త్వరలో మిగతా డీటెయిల్స్ ప్రకటిస్తారేమో!