• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RGV వాయిస్ ఓవర్ తో ఫస్ట్...

RGV వాయిస్ ఓవర్ తో ఫస్ట్ 4 నిమిషాల 'D కంపెనీ' వీడియో..!

By - Tupaki Desk
Update: 2021-05-07 12:28 GMT
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రపంచానికి తెలియని అండర్ వరల్డ్ మాఫియా గురించి తన సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. 2002లో చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన దావూద్ ఇబ్రహీం - చోటా రాజన్‌ ల మధ్య అంతర్యుద్ధం ఆధారంగా 'కంపెనీ' అనే సినిమా తెరకెక్కించిన వర్మ.. ఇప్పుడు తాజాగా ''D కంపెనీ'' అనే సినిమాతో వస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు వర్మ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. మే 15న స్పార్క్ ఓటీటీలో 'డి-కంపెనీ' రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఫస్ట్ 4 నిమిషాల వీడియోను కట్ చేసి విడుదల చేశారు.

'డీ కంపెనీ' 4 నిమిషాల సినిమాని రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేశారు. ''ఇప్పుడు ముంబై చాలా ప్రశాంతగా ఉంది. కానీ 40 ఏళ్ల క్రితం డి-కంపెనీ కంట్రోల్ లో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు. దావూద్ ఇబ్రహీం ని చాలా స్టడీ చేశాను. నేను క్రిమినల్ ని కాదు. కానీ చిన్నప్పటి నుంచి క్రిమినల్స్ ని స్టడీ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో గ్యాంగ్ స్టర్స్ అందరూ దావుద్ లాగా ముంబైకి కింగ్ అవ్వాలని కలలు కన్నారు. కానీ ఇప్పుడు దావూద్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ఫెమస్ అయింది. కానీ ఆ కలలు కన్నవారి పేర్లు పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. డి కంపెనీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది. అంతటి పేరు పొందిన ఆ కంపెనీ 1980లో ఒక అర్థరాత్రి సోనియా బార్ లో.." అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.

దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌ గా అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడన్నది ''D కంపెనీ'' సినిమాలో చూపిస్తున్నారు. ఈ 4 నిమిషాల వీడియోకి రామ్ గోపాల్ వర్మ వాయిస్ అదనపు ఆకర్షణగా నిలిచింది. కెమెరా యాంగిల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై స్పార్క్ సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్యాంగ్‌ స్టర్‌ సినిమాలన్నింటికి మదర్‌ లాంటిదని.. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అని రామ్ గోపాల్ వర్మ చెబుతున్న 'డీ కంపెనీ' ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. స్పార్క్ ఓటీటీలో మే 15 నుంచి వివిధ భాషల్లో 'డి-కంపెనీ' అందుబాటులోకి రానుంది.
Full View
Tags:    
  • RGV 
  • D Company 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS