హోల్ సేల్ గా అందరిని దెబ్బేసిన ‘ఆర్ఆర్ఆర్’
ఒకడి కోసం అందరూ బలి కావటం న్యాయమా? అంటే.. మహాభారతంలో శకుని కోసం ఆయన సోదరులు మరణించటం గుర్తుకు వస్తుంది. ఆ ఉదంతం మినహా.. ఒకడిలాభం కోసం మిగిలిన వారంతా పస్తులు ఉండమని ఎవరూ చెప్పరు. ఆ మాటకు వస్తే.. ఒకరి ప్రయోజనం కంటే అందరి బాగే ముఖ్యం. అవసరమైతే.. ఆ ఒక్కరు నష్టపోయినా మిగిలిన వారు లాభ పడటం కూడా మంచిదే. తాజాగా టాలీవుడ్ వ్యవహారాన్ని చూద్దాం. సంక్రాంతి పండక్కి రావాల్సిన పెద్ద సినిమాలు భీమ్లా నాయక్.. సర్కారు వారి పాట.. ఆచార్య.. ఈ సినిమాల్నివాయిదా వేయించి.. తనకు అవకాశం ఇవ్వాలని జక్కన్న అండ్ కో కోరటం.. అందుకు మిగిలిన వారు సర్లేమని వెనక్కి తగ్గటం తెలిసిందే.
కట్ చేస్తే.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు దేశాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావటం.. మన దేశంలోనే అనేక రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూను విధించటం.. సినిమా హాళ్లలో 50 శాతం కెపాసిటితో రన్ చేయటం లాంటివి చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం ఇప్పుడు మొదలైన థర్డ్ వేవ్.. ఫిబ్రవరి రెండో వారానికి తీవ్రస్థాయికి చేరుతుందని చెబుతున్నారు. మొదటి.. రెండు వేవ్ ల అనుభవంతో చూస్తే.. పీక్స్ కు వెళ్లిన తర్వాత నార్మల్ కండీషన్ కు రావటానికి కనీసం 30 - 45 రోజులు పడుతుంది. అంటే.. ఏప్రిల్ లో కానీ పరిస్థితులు చక్కబడవు.
రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' కారణంగా రిలీజ్ వాయిదా పడిన భీమ్లానాయక్ సంగతే చూస్తే.. ఈ సినిమాను ఫిబ్రవరి 25. అంటే.. నిపుణులు చెబుతున్నట్లుగా కరోనా కేసులు పీక్స్ కు చేరిన పది రోజులకు సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అంచనా వేసినట్లుగా కేసుల సంఖ్య తీవ్రంగా ఉంటే.. సినిమాను విడుదల చేసే సాహసాన్ని నిర్మాతలు చేయరు. ఎందుకంటే.. అప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు.. మొత్తం లాక్ డౌన్ కాకున్నా.. రాత్రి కర్ఫ్యూలను కచ్ఛితంగా అమలు చేసే అవకాశం ఉంది.
అదే జరిగితే.. కలెక్షన్ల మీద భారీ ప్రభావం చూపుతుంది. చూస్తూ.. చూస్తే.. అలాంటి క్లిష్టపరిస్థితిలో సినిమా విడుదల చేసే అవకాశం లేనట్లే. ఒకవేళ.. ఇప్పుడు అనుకున్నదే నిజమైతే.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే.. కనీసం మే వరకు ఆగాల్సిందే. నిజానికి ఇలాంటి పరిస్థితి ఒక్క భీమ్లా నాయక్ కు మాత్రమే కాదు.. ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా పడిన అన్ని సినిమాల పరిస్థితి ఇదే. ఇదంతా చూసుకున్నప్పుడు రాజమౌళికి రావాల్సిన లాభాల కోసం మిగిలిన హీరోలు.. ఆ మాటకు వస్తే.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం బలిపీఠం ఎక్కాల్సి రావటానికి మించిన విషాదం మరింకేముంది?
ఃఒక పెద్ద హీరో సినిమా విడుదల ఆగితే.. జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాదు.. ఒక సినిమా విడుదల ఆగిన నేపథ్యంలో.. తర్వాతి సినిమా విడుదల మీదా ప్రభావం చూపుతుంది. అన్నింటికి మించి.. ఇప్పుడు ఎలాంటి సెంటిమెంట్ రాగాన్ని తీసి.. మిగిలిన వారి చిత్రాల విడుదల వాయిదా వేయించారో.. మరోసారి అలాంటి రాగాన్ని.. ఆ స్థాయిలో కాకున్నా.. కాస్త తక్కువ స్థాయిలో ఆలపించినా.. మరికొన్నిసినిమాలు బలి కాక తప్పదు. మొత్తానికి ఇండియన్ సినిమా గ్లోరీగా పిలిచే మూవీ.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఘోరీగా మారకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.