పూరి స్పీడ్ కి ఝలక్ తగిలినా `ఫైటర్` యాక్షన్ కి రె`ఢీ`!
విజయ్ దేవరకొండ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ `ఫైటర్` ప్లాన్ కి మహమ్మారీ గండి కొట్టిన సంగతి తెలిసిందే. ఊహించని పిడుగులా వూహాన్ (చైనా) వైరస్ మీదపడడంతో టాలీవుడ్ షూటింగులన్నీ బంద్ అయిపోయాయి. ఇది ఫైటర్ కి ఇబ్బందికరంగా మారిందని గుసగుసలు వినిపించాయి. ముంబై నేపథ్యంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాలని భావించిన పూరీ కాళ్లకు ముందర బంధం వేసింది మహమ్మారీ.
కరణ్ జోహార్ .. అనన్య పాండే లాంటి వాళ్లను ఒప్పించి ఈ ప్రాజెక్టును మరో లెవల్ కి తీసుకెళ్లాలని అనుకుంటే ఊహించని పరిణామం షాకిచ్చింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పూరి తన ప్రయత్నం మాత్రం మానుకోలేదు. అతడికి కావాల్సిన సాయం అందిస్తూ రౌడీ బోయ్ దేవరకొండ అలానే ఛార్మి తదితర చిత్రబృందం ఈ మూవీ చిత్రీకరణకు పక్కా ప్రణాళికను రచించారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఫైటర్ చిత్రీకరణను వచ్చే నెల 24 నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ చేశారట. తాజా షెడ్యూల్ లో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇటీవల లాక్ డౌన్ లో దేవరకొండ లుక్ మార్చింది ఈ యాక్షన్ సీక్వెన్సుల కోసమేనని తాజాగా రివీలైంది.