చిరంజీవికి 15 మంది గాళ్స్ ప్రేమ‌లేఖ‌లు రాశారు

Update: 2021-04-30 11:24 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరో కాక ముందు ఆయన కూడా ఒక విద్యార్థి. ఆయ‌న చ‌దువుకునే స‌మ‌యంలో ఏవైనా ప్రేమ‌లేఖ‌లు అందాయా? అంటే.. అందాయ‌నే అంటున్నారు ఆయ‌న క్లాస్ మేట్ కం ఫ్రెండ్ డా.స‌త్య‌ప్ర‌సాద్.

ఓ ప‌ది ప‌దేహేను మంది అమ్మాయిల‌ నుంచి ప్రేమ లేఖ‌లు చిరుకి అందాయ‌ని ఆ రోజుల్లో ఇర‌వైల సంఖ్య‌లోనే ఆయ‌న‌ను ప్రేమించార‌ని తెలిపారు. అయితే అది సెన్సిటివ్ మ్యాట‌ర్ కావ‌డంతో ఆయన ఏనాడూ ఆ అమ్మాయిల్ని ఏదీ అన‌లేద‌ని ఇగ్నోర్ చేసేసేవాడ‌ని న‌వ్వేశారు.

ప‌దో త‌ర‌గ‌తి నుంచే ఆయ‌న‌కు ప్రేమ‌లేఖ‌లు అందేవి. కానీ ఆయ‌న ఏనాడూ ప‌ట్టించుకునేవారు కాదు! అని స‌త్య ప్ర‌సాద్ తెలిపారు. స్కూల్ కాలేజ్ డేస్ అమ్మాయిల నుంచి చిరుకి స్లిప్పు(లేఖ‌)లు అందేవ‌ని స‌ర‌దాగా న‌వ్వేశారు. వారిని బాగా చ‌దువుకోవాల‌ని సూచించేవారని తెలిపారు.

అలాగే ఆయ‌న చిరు- ప‌వ‌న్ మ‌ధ్య ఓ ఘ‌ట‌న గురించి కూడా చెప్పారు. ఒకప్పుడు మొత్తం మద్రాస్ (చెన్నై) భారీ వరదలతో మునిగిపోయిన స్థితిలో .. పవన్ కళ్యాణ్ ను ఒక మురికివాడకు తీసుకెళ్ళాడని అక్కడ ఆ ప్రజలు నివసించే విధానాన్ని చూపించారని తెలిపారు. ఆ రోజు ఉదయం త‌న‌కు బిర్యానీ తినాలని పవన్ విరుచుకుపడినప్పుడు  చిరంజీవి ఆ మురికివాడ‌కు తిప్పి చూపించార‌ని సత్య ప్రసాద్ చెప్పారు.

చిరంజీవి కుటుంబం మొత్తం ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ఉంది. ఎందుకంటే వారు వ్యక్తిగతంగా చాలా చూశారు. మద్రాసులో జరిగిన ఈ సంఘటన పవన్ నాయకుడిగా తన ప్రయాణంలో మొదటి అడుగు అయి ఉండవచ్చునని అన్నారు. ప్ర‌జ‌ల‌కు సాయ‌ప‌డే గుణం ప‌వ‌న్ కి ఆనాడే అబ్బింద‌ని తెలిపారు. నాగ బాబు కూడా ప్రజలకు ఎంతో సహాయపడే వ్యక్తి అని సత్య ప్రసాద్ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో అన్నారు.
Full View
Tags:    

Similar News