• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్‌ః ఏంటది ఫిదా...

ట్రైలర్ టాక్‌ః ఏంటది ఫిదా ట్రైలరా?

By - Tupaki Desk
Update: 2017-06-23 08:34 GMT

ఈరోజు మల్టీప్లెక్సులలో ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమాను చూసినోళ్ళకు ఇంటర్వెల్ లో భారీ షాకే తగిలింది. ఎందుకంటే ఊహించని విధంగా అక్కడ వరుణ్‌ తేజ్ చేసిన ''ఫిదా'' సినిమా ట్రైలర్ రిలీజైంది. కనీసం చిన్ని ఇంటిమేషన్ లేకుండా సడన్ గా ఈ ట్రైలర్ రిలీజ్ చేసేపాటికి అందరూ ఖంగారుపడ్డారు. అసలు ఏ సినిమా ట్రైలర్ చూస్తున్నారో తెలిసేలోపు ట్రైలర్ అయిపోయింది.

లవర్ బాయ్ లా ఉండే ఒక అమెరికా రిటర్న్ కుర్రాడు.. పక్కా తెలంగాణా పోరికి పడిపోతాడు. ఇటు వరుణ్‌ తేజ్ తన కూల్ లుక్స్ తో అటు సాయి పల్లవి తన ప్రెజన్స్ తో బాగానే ఆకట్టుకున్నారు. కాకపోతే కథ మాత్రం అందరికీ తెలిసిన కథలాగే ఉంది. సాధారణంగా శేఖర్‌ కమ్ముల సినిమాల్లో కథలు అలాగే ఉంటాయిలే. ఇకపోతే ఇక్కడ కూడా మనోడు హీరోయిన్ నడుమును ఉండీలేనట్లు చూపిస్తూ.. అప్పట్లో కమిలిని ముఖర్జీతో చేయించిన మ్యాజిక్ ఇప్పుడు సాయిపల్లవితో కూడా చేయించేశాడు. ట్రైలరంతా ఆమె నడుం షాట్లతోనే నిండిపోయింది అంటే అతిశయోక్తికాదులే. ఇక ఫైనల్ గా వీరిద్దరూ ప్రేమలో పడి ఏమైపోతారు అనేదే సినిమా. మనోడు ప్రపోజ్ చేసినా ఆమె ఒప్పుకోలేదు అనే ట్విస్టుతో ట్రైలర్ ఎండైంది.

అయితే ఒక్క విషయం ఏంటంటే.. అసలు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి రిలీజ్ చేసుంటే.. జనాలు చాలా ఆసక్తిగా చూసేవారు. ఏదో సడన్ గా ఒక వీడియో వచ్చేసి.. ఒక నిమిషం పాటు చూశాక.. ''ఓహ్ ఇది ఫిదా ట్రైలరా??'' అనే షాకులోనే చాలామంది ట్రైలర్ లోని స్వీట్నెస్ మిస్సయిపోతారు. అది మాత్రం గ్యారంటీ.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Fidaa 
  • Varun Tej 
  • Sai Pallavi 
  • Fidaa Movie 
  • Fidaa Trailer 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS