ఆ నిజం చెప్పడానికి సంకోచించ‌నుః న‌టి

Update: 2021-05-02 23:30 GMT
గ్లామ‌ర్ ఫీల్డ్ అంటేనే అందం! అందం అంటే తెలుపు! ఇదీ.. ప్ర‌పంచం న‌మ్మే సూత్రం. ఆచ‌రించే సిద్ధాంతం. కానీ.. ఆ సిద్ధాంతాన్ని బ‌ద్ద‌లు కొట్టినవారు ఎంద‌రో ఉన్నారు. టాలెంట్ కు రంగుతో ప‌నిలేద‌ని, అవ‌స‌ర‌మే లేద‌ని నిరూపించారు. అలాంటి వారిలో ఒక‌రు న‌టి మైత్రేయి రామ‌కృష్ణ‌న్.  భార‌తీయ మూలాలున్న ఈ న‌టి.. త‌న లైఫ్ హిస్ట‌రీ చెప్పుకొచ్చింది.

మైత్రేయి మూలాలు భార‌త్ లోని త‌మిళ‌నాడులో ఉన్నాయి. ఆమె త‌ల్లిదండ్రులు రామ్ సెల్వ‌రాజ్, కృతిక సెల్వ‌రాజ్ త‌మిళ‌నాడుకు చెందిన‌వారు. అనివార్య కార‌ణాల‌తో వారు కెన‌డాకు వెళ్లిపోయారు. అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. ఆ విధంగా మైత్రేయి అక్క‌డే జ‌న్మించింది.

చిన్న‌ప్పుడు ఎన్నెన్నో క‌ల‌లుగ‌న్న మైత్రేయి.. స్కూలింగ్ లో న‌ట‌న‌వైపు ఆక‌ర్షితురాలైంది. అలా మొద‌లైన ఆస‌క్తి ఆమెతోపాటు పెరుగుతూ వ‌చ్చింది. స్ట‌డీస్ కంప్లీట్ అయిన త‌ర్వాత ఆవైపుగానే ప‌య‌నించింది. కొంత మంది ఎన్నో ఆడిష‌న్స్ త‌ర్వాత అవ‌కాశాన్ని పొందితే.. మైత్రేయి మాత్రం ఫ‌స్ట్ ఆడిష‌న్ లోనే ఛాన్స్ కొట్టేసింది. అది కూడా దాదాపు 15 వేల మందిని వెన‌క్కి నెట్టి!

ఇదొక్క లెక్క చాలు త‌ను ఎంత‌టి అద్భుత‌మైన న‌టి అన్న‌ది చెప్ప‌డానికి! ఆ విధంగా ‘నెవర్ హావ్ ఐ ఎవ‌ర్‌’లో లీడ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచింది. అంతేకాదు.. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

ఇక‌, న‌టులు చాలా మంది త‌మ ప‌నితాము చూసుకుని వెళ్తుంటారు. కానీ.. మైత్రేయి అలా కాదు. సామాజిక బాధ్య‌త‌ను కూడా చాటుకుంటుంది. ఇప్ప‌టికే ఆమె ప‌లు సామాజిక పోరాటాల్లోనూ పాల్గొన‌డం విశేషం. ఈ విధంగా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను సొంతం చేసుకున్న‌ మైత్రేయి.. త‌న‌ సంస్కృతి త‌మిళం అని స‌గ‌ర్వంగా చాటుకుంటూ ఉంటుంది. తాను పుట్టింది కెన‌డాలో అయినా త‌మిళ‌మే త‌న క‌ల్చ‌ర్ అని చాటి చెబుతుంది.  ఈ నిజం చెప్ప‌డానికి తాను ఎప్పుడూ సంకోచించ‌ని అంటోంది మైత్రేయి.
Tags:    

Similar News