మంచు బ్యూటి వలన పోస్టర్లు రాలేదా?

Update: 2017-04-07 05:36 GMT
''ఫ్యాషన్ డిజైనర్'' సినిమాతో సీనియర్ డైరక్టర్ పసలపూడి వంశీ తానేంటో గట్టిగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ మధ్యన తీసిన రెండు మూడు సినిమాలు బడ్జెట్ దృష్ట్యా అంత క్వాలిటీగా రాలేదు కాని.. ఇప్పుడు మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా మాత్రం కాస్త ఇంట్రెస్టింగానే ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న వచ్చేసినప్పటికీ.. ఇప్పుడు దాని గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంకా బోల్డ్ గా డిజైన్ చేశారట. హీరోయిన్ చెస్ట్ దగ్గర కొలతలు తీస్తున్నట్లు.. హీరో కొంటెగా చూస్తున్నట్లు.. హీరోయిన్ కూడా ఒక రకమైన ఎక్సప్రెషన్ ఇస్తున్నట్లు.. ఒక పోస్టర్ రెడీ చేశారట. ఖచ్చితంగా ఆ పోస్టర్ రిలీజైతే యూత్ కు పిచ్చెత్తిపోయేది అంటున్నారు సన్నిహితులు. అయితే మంచు లక్ష్మి మొన్న ట్వీట్ వేసి రచ్చ చేయడంతో.. అనవసరం రాద్దాంతం ఎందుకులే అనుకున్న మధుర శ్రీధర్.. ఆ పోస్టర్ ను పక్కనెట్టేసి వేరే డిజైన్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారట.

విషయం ఏంటంటే.. ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా జనాలకు షాకిచ్చింది. ఇప్పటివరకు ఎప్పుడూ నాభి అందాలను ఆరబోయడం దిశగా పయనించని డస్కీ బ్యూటి అనీషా ఆంబ్రోస్.. ఇప్పుడు ఏకంగా తన గ్లామర్ ఆరబోతతో రచ్చ లేపుతోంది మరి. పోస్టర్లే ఇలా ఉంటే.. సినిమాలో ఈమె ఆరబోసిన అందాలను చూసుకోండి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News