అఖిల్ సినిమాలో బాలయ్య బ్యూటీ

Update: 2018-07-08 16:43 GMT
తెలుగు సినిమా ఎంత మారినా.. ఐటెం సాంగ్స్ సంప్రదాయం మాత్రం వీడిపోదు. అవి సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని ఇప్పటికీ ఫిలిం మేకర్స్ నమ్ముతున్నారు. సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ సైతం ఇంకా ఐటెం  సాంగ్ సెంటిమెంటును వదలట్లేదు. బ్లాక్ బస్టర్ హిట్టయిన ఆయన కొత్త సినిమా ‘రంగస్థలం’లోనూ జిగేల్ రాణి రూపంలో ఐటెం సాంగ్ చూడొచ్చు. అక్కినేని అఖిల్ కొత్త సినిమాలోనూ ఇలాంటి ఓ పాటను సెట్ చేసి పెట్టుకున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. వీళ్లిద్దరి కాంబినేషన్లో సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా లండన్లో మొదలైంది.

ఈ చిత్రంలో ‘సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. ఒక విదేశీయురాలితో ఐటెం సాంగ్ చేయిస్తున్నాడు వెంకీ అట్లూరి. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఐటెం సాంగ్ చేసిన ఫరా కరిమీ ఇందులో ఐటెం సాంగ్ చేయబోతుండటం వివేషం. ఫరా సాయిధరమ్ తే్జ్ సినిమా ‘తిక్క’లోనూ ఒక పాట చేసింది. తన తొలి సినిమా ‘తొలిప్రేమ’లో సిట్యువేషనల్ సాంగ్స్‌ తోనే సాగిపోయిన వెంకీ.. రెండో సినిమాలో మాత్రం మసాలా పాటను కోరుకుంటున్నాడు. అఖిల్ తొలి రెండు సినిమాలు నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమాను ఎలా అయినా హిట్ చేయాలనుకుంటున్నారు. అందుకోసం అన్ని రకాల ఆకర్షణలూ జోడిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని భావిస్తున్నారు. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని సమాచారం.


Tags:    

Similar News