రాజ‌మౌళిగారూ ఇది విన్నారా?

Update: 2016-10-08 05:33 GMT
వ‌ర్చువ‌ల్ రియాలిటీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని పంచాల‌ని నిర్ణ‌యించారు రాజ‌మౌళి.  బాహుబ‌లి సెట్‌ లో మ‌న‌మూ ఉన్నామ‌నే భావ‌న‌కి గురిచేస్తూ 360 డిగ్రీస్‌ లో ఏ కోణంలో నుంచైనా చూసేలా  వ‌ర్చువ‌ల్ రియాలిటీ వీడియోస్ ఉంటాయ‌ని వెల్ల‌డించాడాయ‌న‌. ప్ర‌భాస్ పుట్టిన‌రోజైన అక్టోబ‌రు 23న  బాహుబ‌లి ది క‌న్‌ క్లూజ‌న్ మేకింగ్ వీడియోని వ‌ర్చువ‌ల్ రియాలిటీ రూపంలో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ వీడియో గురించి తెలుగు ప్రేక్ష‌కులే కాదు, మొత్తం ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తోంది.

అయితే జ‌క్క‌న్న స్టేట్‌ మెంట్‌ ని చూసి కుర్రాళ్లు ఓ కొంటె రెక్వెస్ట్ చేశారు.  వ‌ర్చువ‌ల్ రియాలిటీలో  మాకు ప్ర‌త్యేక‌మైన  ఓ షాట్‌ని మాత్రం త‌ప్ప‌నిస‌రిగా  చూపించాల‌ని కోరుతున్నారు. ఇంత‌కీ ఆ ఆ షాట్ ఏంటో తెలుసా? ప‌చ్చ‌బొట్టేసినా పిల్ల‌గాడా నువ్వు... పాట‌లో త‌మ‌న్నా - ప్ర‌భాస్‌ల మ‌ధ్య వ‌చ్చే ఘాటైన స‌న్నివేశం. పైన ఫోటోలో క‌నినిపిస్తున్న ఆ స‌న్నివేశాన్ని  360 డిగ్రీస్‌ లో చూసే సౌల‌భ్యాన్ని క‌ల్పించాల‌ని రెక్వెస్ట్ చేస్తున్నారు. ఇది నిజంగానే టూ మ‌చ్ కొంటె రెక్వెస్ట్ క‌దూ!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News