• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫేవ‌రెట్ హీరో మిస్సింగ్...

ఫేవ‌రెట్ హీరో మిస్సింగ్ పై ఫ్యాన్స్ ఆవేద‌న‌

By - Tupaki Desk
Update: 2022-01-21 03:00 GMT
ప్రియాతి ప్రియమైన అభిమాన‌ సైన్యం షారుఖ్ ఖాన్ ను `బాలీవుడ్ కింగ్‌` అని పిలుస్తారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని అంతగా ఆకట్టుకుంటుంది. రొమాన్స్ అంటే ఏంటో.. సిస‌లైన ఎంటర్ టైన్ మెంట్ అంటే ఏంటో మీనింగ్ చెప్పిన గురుడు కింగ్ ఖాన్. అత‌డి శైలి మహిళలను ఆకర్షిస్తుంది. అయితే బాద్షా చాలా కాలంగా గ్లామర్ ప్రపంచం నుండి యాక్షన్ కు దూరమయ్యాడు. అతని చివరి చిత్రం జీరో 2018 సంవత్సరంలో విడుదలైంది. గత సంవత్సరం అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు జరిగినప్పటి నుండి అతను ట్విట్టర్ లో తన అభిమానులతో ఇంటరాక్ట్ కాలేదు. గురువారం సాయంత్రం అతని అభిమానులు సోషల్ మీడియాలో తమ భావాలను వ్యక్తం చేశారు.

వి మిస్ యు SRK అంటూ ట్రెండ్ చేశారు. అభిమానులు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ట్విట్టర్ లోకి వెళ్లారు. షారూఖ్ ఖాన్ నుండి రిలీజ్ కి సంబంధించిన శుభ‌వార్త‌ వినడానికి ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు హ్యాష్ ట్యాగ్ ల‌లో ‘వి మిస్ యూ SRK’ ట్రెండింగ్ అవుతోంది. SRK పాత ఫోటోలు వీడియోలు బెస్ట్ మెమరీస్ ను ట్వీట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ త‌మ‌దైన మార్క్ AskSRK ని ట్విట్టర్ లో నిర్వహించమని షారుఖ్ ను అభ్యర్థించారు. ఇది ప్రాథమికంగా ప్రశ్న-జవాబుల‌ థ్రెడ్. ఒక అభిమాని ట్వీట్ చేస్తూ 4 నెలలు అయ్యింది #WeMissYouSRK..  అతను త్వరలో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను అంటూ ఆవేద‌న చెంద‌గా.. మరొక అభిమాని ఇలా వ్రాశాడు, ``బాలీవుడ్ మీరు లేకుండా బాలీవుడ్ కాదు`` అని వ్యాఖ్యానించారు.

SRK కుమారుడు ఆర్యన్ ఖాన్ గత సంవత్సరం ముంబైలో క్రూయిజ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతను అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ ఆర్థర్ రోడ్ జైలులో ఒక నెల గడిపారు. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటి నుండి SRK ఎటువంటి బహిరంగ ట్వీట్లు చేయలేదు.  అయితే ట్విట్ట‌ర్ లో ఫ్యాన్స్ ని సంతుష్టుల‌ను చేసేందుకు ట‌చ్ లోకి వ‌స్తార‌ని ఆశిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. షారుఖ్ ఖాన్ తదుప‌రి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న‌ `పఠాన్` చిత్రంలో కనిపించనున్నారు. అతను అట్లీ తో ఓ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3లో అతిథి పాత్రలో క‌నిపించ‌నున్నారు.
Tags:    
  • Shah Rukh Khan 
  • Shah Rukh Khan Insta Post 
  • Shah Rukh Khan Movies 
  • Aaryan Khan Issue 
  • Shah Rukh Khan Shootings 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS