• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల రాశిపై...

అందాల రాశిపై దుష్ప్ర‌చారం?

By - Tupaki Desk
Update: 2018-08-16 04:26 GMT
రంగుల ప్ర‌పంచంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. ప‌రిశ్ర‌మ‌ ఓసారి నెత్తిన పెట్టుకుని పూజిస్తుంది. ఇంకోసారి పూర్తిగా కిందికి దించేస్తుంది. కొంద‌రిని పాతాళానికి తొక్కేసిన సంద‌ర్భాలుంటాయి. ఇందుకు క‌థానాయిక‌లు సైతం అతీతులేం కాదు. ఫేవ‌ర్ చేయ‌క‌పోయినా - హిట్టు రాక‌పోయినా తొలిగా నింద ఎదుర్కోవాల్సింది క‌థానాయిక‌లే. ఈ త‌ర‌హా నింద‌కు కార‌ణం ర‌క‌రాల కోణాల్లో ఉంటుంది. ఇదిగో ఇటీవ‌లి కాలంలో అందాల‌ రాశీఖ‌న్నాపై సాగుతున్న ప్ర‌చారం చూస్తుంటే ఇలాంటి ఎన్నో సందేహాలు క‌ల‌గ‌కుండా ఉండ‌వు.

`ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో విజ‌యం అందుకుని - అటుపై ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించిన రాశీఖ‌న్నా ఇంకా కెరీర్ ప‌రమైన స్ట్ర‌గుల్ ఎదుర్కొనే స‌న్నివేశంలోనే ఉందేమో! అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. హిట్టును మాత్ర‌మే న‌మ్మే ప‌రిశ్ర‌మ‌లో ఆ హిట్టు ముఖం చాటేస్తే ఆ త‌ప్పులో హీరోయిన్ భాగ‌స్వామ్యాన్ని త‌ప్ప‌క వేలెత్తి చూపిస్తారు. ప్ర‌స్తుతం రాశీ అలాంటి ఫేజ్‌ నే ఎదుర్కొంటోందా? అన్న డౌట్ పుడుతోంది. రీసెంట్ గాసిప్పుల్లో రాశీపై పుడుతున్న పుకార్లు ఆ రేంజులో ఉన్నాయి మ‌రి. ఇక పుండు మీద కారంలా `శ్రీ‌నివాస‌క‌ళ్యాణం` ఫ‌లితం రాశీపై దుష్ప్ర‌చారానికి కార‌ణ‌మ‌వుతోంద‌న్న సందేహాలు రాజుకుంటున్నాయ్‌.

రాశీకి నిర్మాత దిల్‌ రాజుతో విభేధాలున్నాయ‌ని వేరొక ప్ర‌చారం ఫిలింన‌గ‌ర్‌ - కృష్ణాన‌గ‌ర్‌ లో జోరుగా సాగుతోంది. త‌నను హీరోయిన్‌ గా తీసుకోవ‌ద్ద‌ని దిల్‌ రాజు ఇత‌ర నిర్మాత‌ల‌కు ఫోన్ చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఎన్టీఆర్ చిత్రంలో జ‌య‌ప్ర‌ద పాత్ర‌ను ఆఫ‌ర్ చేస్తే రాశీ ఇంకా ఆలోచిస్తోంద‌ని - ఒక పాట ఒక సీన్‌ కే ప‌రిమితమ‌య్యే రోల్‌ కావ‌డంతో ఇలా చేస్తోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఈ ప్ర‌చారంలో నిజం ఎంత‌?  పుకార్ ఎంత‌? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. దీనిపై రాశీ వివ‌ర‌ణ ఇస్తుందా? అన్న‌ది చూడాలి. హైద‌రాబాద్‌ లో సెటిలైన రాశీ టాలీవుడ్ కెరీర్‌ ని పెద్ద రేంజులో ఆశిస్తోంది. ఇలాంటి వేళ ఈ ప్ర‌చారం త‌న‌కు ఇబ్బందిక‌ర‌మేన‌న‌డంలో సందేహం లేదు.
Tags:    
  • Raashi Khanna 
  • Telugu Film Industry 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS