మేలో ఢీకొడుతున్న `ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 9`

Update: 2021-02-09 04:31 GMT
బాక్సాఫీస్ రికార్డుల్ని బ‌ద్ధ‌లుగొడుతూ వ‌ర‌ల్డ్ వైడ్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ సిరీస్ ప్ర‌త్యేక‌త‌. ఈ భారీ మాస్ యాక్ష‌న్ సిరీస్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆద‌ర‌ణ అలాంటిది. ఇప్ప‌టికే ఈ ఫ్రాంఛైజీలో ఎనిమిది సినిమాలు రిలీజై సంచ‌ల‌నాలు సృష్టించాయి.

ఈసారి F9 (తొమ్మిదో సినిమా) సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎఫ్ 9 సూపర్ బౌల్ కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది.  ప్రోమో ఆద్యంతం హై విజువ‌ల్ రిచ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు మ‌తి చెద‌ర‌గొడుతున్నాయి. ఈ చిన్న‌పాటి ప్రోమోలో ఈ చిత్రంలోని కీల‌క న‌టులంతా తిరిగి క‌నిపించారు.

భీక‌ర‌మైన‌ కార్ ఛేజ్ లు.. రేసింగ్ ఎపిసోడ్స్ ..స్పీడ్ యాక్ష‌న్.. స్పెషల్ ఎఫెక్ట్స్,.. ఇవ‌న్నీ ఫ్రాంచైజీకి ఆభ‌ర‌ణాలు. తాజా చిత్రంలోనూ ఈ క్వాలిటీస్ ని అభిమానులు ఆశించ‌వ‌చ్చని సూబ‌ర్ బౌల్ భ‌రోసానిచ్చింది.  28 మే 2021 న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ ఫ్రాంఛైజీలో దేని ప్ర‌త్యేక‌త దానికుంది. ఇక ఇందులో ఇత‌ర‌ సినిమాల కంటే ఎఫ్ 9 అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న అతి భారీ చిత్ర‌మ‌న్న ప్ర‌చారం ఉంది. జస్టిన్ లిన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అతడు డేనియల్ కేసీతో కలిసి స్క్రిప్ట్ రాశాడు. విన్ డీజిల్ ‌తో పాటు ఈ చిత్రంలో మిచెల్ రోడ్రిగెజ్- టైరెస్ గిబ్సన్- క్రిస్ లుడాక్రిస్ బ్రిడ్జెస్- జాన్ సెనా- జోర్డానా బ్రూస్టర్- నథాలీ ఇమ్మాన్యుయేల్- సుంగ్ కాంగ్- హెలెన్ మిర్రెన్ - చార్లిజ్ థెరాన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మునుప‌టిలానే విన్ డీజిల్ ఇందులో భీక‌ర‌మైన యాక్ష‌న్ తో అద‌ర‌గొట్ట‌బోత‌న్నాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ క‌నెక్టివిటీతో తాజా వెర్ష‌న్ ఇర‌గ‌దీయ‌బోతోంద‌ట‌.

Full View

Tags:    

Similar News