#F3 చివ‌రికి అవ‌న్నీ పుకార్లేన‌ని తేల్చారు

Update: 2020-11-29 04:50 GMT
విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2 సీక్వెల్ చేసేందుకు ఆస‌క్తిగా లేరా?  వెంకీతో స‌మానంగా త‌న పాత్ర ప‌రిధి విస్త‌రించ‌లేద‌ని అలిగారా? పారితోషికం ప‌రంగా నిర్మాత‌ల‌తో డీల్ కుద‌ర‌లేదా? అందుకే ఈ ప్రాజెక్ట్ ఆల‌స్య‌మ‌వుతోందా? గత కొద్ది రోజులుగా ఎఫ్ 2 సీక్వెల్ (ఎఫ్ 3) పై నెల‌కొన్న సందిగ్ధ‌త సందేహాలు ఇవి. ఇటీవ‌ల ఈ ప్రాజెక్టుపై జ‌రుగుతున్న ఈ ప్ర‌చారఆనికి తాజాగా చెక్ ప‌డిపోయింది. వరుణ్ తేజ్ ఆసక్తి చూపకపోవడంతో ఎఫ్- 3 లో భారీ మార్పులు జరుగుతున్నాయని పుకార్లు వచ్చినా అవేవీ నిజాలు కావ‌ని తెలిసింది.

ఇదంతా అస‌త్య ప్ర‌చారం. ఈ సీక్వెల్ కోసం వెంకటేష్ -వరుణ్ తేజ్ ఇద్దరూ చాలా ఆస‌క్తిగా ఉన్నారు. ఎఫ్ 2 కి కొన‌సాగింపు క‌థ‌తో కాకుండా ఈ మూవీని మ‌రో డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కించ‌నున్నారు. పురుషుల జీవితంలో మహిళల వల్ల కల్లోలం అన్న థీమ్ ని ఎంచుకున్నా.. ఈసారి మూడో హీరోని యాడ్ చేసి మ‌రోసారి ఆద్యంతం కామెడీ థ్రిల్ క‌లిగే స్క్రిప్టును రెడీ చేశార‌ట‌. ఇంతకుముందు ఎఫ్ 3 కోసం కొత్త ఆలోచన తో ముందుకు వెళుతున్నానని రావిపూడి చెప్పారు.

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫ్రాంచైజీ లో కంటిన్యూ అవుతుందిట‌. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2021లో మూవీ రిలీజ‌వుతుంది.
Tags:    

Similar News