పార్టీ మూడ్ లో F2 టీమ్!

Update: 2019-01-14 17:26 GMT
సంక్రాంతి సీజన్లో చివరిగా రిలీజ్ అయిన సినిమా 'F2'.  లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తానని ఒక పాపులర్ సినిమా డైలాగ్ ఉంది కదా.. ఆ డైలాగ్ 'F2' సినిమాకు కరెక్ట్ గా సరిపోతుంది.  పెద్దగా అంచనాలు లేవు.. పోటీలో విడుదలయిన ఇతర సినిమాలకు ఉన్న హైప్ కూడా లేదు. అయినా 'F2' మంచి ఓపెనింగ్స్ తో థియేట్రికల్ రన్ మొదలైంది.  

వెంకీ-వరుణ్ తేజ్ ల కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.  మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైనర్లలు మలచడం లో స్పెషలిస్ట్ అని తెలిసిందే.  ఇలాంటి దర్శకుడికి వెంకటేష్ లాంటి అధ్బుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటుడు తోడయ్యారు.  వెంకీ తనదైన శైలిలో కామెడీని పండించడంతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.   అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అవుతూ ఉండడంతో థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు.

దీంతో 'F2' టీమ్ సక్సెస్ సంబరాల్లో మునిగిపోయింది.   వెంకటేష్.. వరుణ్ తేజ్.. అనిల్ రావిపూడి.. మెహ్రీన్.. అనసూయ.. హరితేజ మరికొందరు 'F2' టీం మెంబర్స్.. టెక్నిషియన్స్.. ఈ పార్టీకి హాజరయ్యారు.  ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.  
Tags:    

Similar News