టాప్ 5 రిలీజ్ లతో ఓటీటీలో పసందైన వినోదం
కరోనా సెకెండ్ వేవ్ తో సినీ ప్రియులకు ఇబ్బంది కరంగానే ఉంది. థియేటర్లు మూత పడటం..రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించడం.. కొన్నిచోట్ల పరిమిత అనుమతులు.. వెరసి రకరకాల కారణాలతో ఎంటర్ టైన్ మెంట్ ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఓటీటీ ఒక్కటే వినోదానికి వేదిక. అయితే ఓటీటీలో ఇదివరకూ చూసేసిన సినిమాలే ఉన్నాయి. కొత్త సినిమాలు లేవని అభిమానుల నుంచి నిరుత్సాహం వ్యక్తం అవుతోంది. ఏడాది కాలంగా పరిస్థితులు క్లిష్టంగా మారడం సినిమాలు తగ్గిపోవడంతో ఓటీటీలు సైతం సరైన సినిమాలు అందించలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వారంలో ఓటీటీలో కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కొరియన్ భాషలో తెరకెక్కిన `మిరానీ` అనే అమెరికాన్ డ్రామా చిత్రం అమెజాన్ ప్రైమ్ లో లైవ్ అవుతుంది. లీ- ఇస్సాక్ చాంగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్కార్ కి సైతం నామినేట్ అయింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన `రాధే` చిత్రం ఈనెల 13న థియేటర్లతో పాటు ఏకకాలంలో జీ- ప్లెక్స్ ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజవుతోంది.
అలాగే రాజ్ అండ్ డీక్ డైరెక్ట్ చేసిన `సినిమా బండి` మే 14న నెట్ ప్లిక్స్ లో రిలీజవుతోంది. విలేజ్ కామెడీ నేపథ్యంలోని చిత్రమిది. ట్రైలర్.. ఇతర ప్రచార చిత్రాలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన `కర్ణన్` గత నెలలో థియేటర్లో రిలీజై మంచి సక్సెస్ అయింది. ఈ చిత్రాన్ని మే 14న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే `ఫెర్రీ` అనే డచ్ ఫిల్మ్ కూడా ఇదే నెల 14న నెట్ ఫ్లిక్స్ లో రిలీజవుతోంది. నెదర్లాండ్స్ లోని డ్రగ్స్ కార్టెల్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. పాలపులర్ అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ రాయ్ హాల్స్ట్ న్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హాల్స్టన్ కూడా ఇదే నెలలో ఓటీటీలో రిలీజవుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో ఈ చిత్రాలన్నీ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతాయనే ఆశిద్దాం.