• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ద కిస్ ఆఫ్ లైఫ్' ...

'ద కిస్ ఆఫ్ లైఫ్' అంటున్న హీరో

By - Tupaki Desk
Update: 2016-02-20 22:30 GMT
హాట్ హీరోగా ఇమ్రాన్ హష్మీకి బాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ఉంది. కానీ ఇతను నిజ జీవితంలో మాత్రం చాలా పెద్ద కష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినవారికి ఏదైనా జరిగితే బాధపడతాం. అదే కన్న పిల్లలకే కష్టం వస్తే ఆ బాధ వర్ణనాతీతం. అదే ఇమ్రాన్ హష్మీని ఇన్నేళ్లూ వేధించింది. కన్న కొడుకుకు కేన్సర్ వ్యాధి సోకడం ఇమ్రాన్ హష్మీని బాగా కలచివేసింది.

కానీ ఎంతో పట్టుదలతో తన కొడుకును ఆ రోగం నుంచి దూరం చేయగలిగాడు ఇమ్రాన్ హష్మీ. ఇప్పుడు తన వేదనను, అనుభవాలతో ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పెట్టిన టైటిల్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 'ద కిస్ ఆఫ్ లైఫ్: హౌ ఏ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ కేన్సర్'. తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ హష్మీకి పర్వీన్ సహానీతో పెళ్లి జరిగింది. వీరి కొడుకుకి కేన్సర్ సోకడంతో ఇద్దరూ తల్లడిల్లిపోయారు. కొడుకు పడుతున్న బాధను చూసి వేదన చెందారు. ఆ సమయంలో వీరు పడిన బాధ, కొడుకు అనుభవించిన వేదనలనే అనుభవాలుగా ఈ పుస్తకాన్ని రాశాడు ఇమ్రాన్ హష్మీ.

ఇంగ్లీష్ - హిందీ - మరాఠీ భాషల్లో ఈ పుస్తకం విడుదల కానుంది. తన కష్టాన్ని పుస్తకంగా ప్రచురిస్తున్న పబ్లిషర్స్ కు కృతజ్ఞతలు చెప్పిన ఈ హీరో.. ఈ ఏడాది చివరి నాటికి ఈ పుస్తకం స్టాండ్స్ లో ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అజారుద్దీన్ పేరుతో.. క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ బయోపిక్ లో నటిస్తున్నాడు ఇమ్రాన్ హష్మీ.
Tags:    
  • Emraan Hashmi 
  • Ayaan 
  • Kiss Of Life 
  • Telugu NEWs 

Similar News

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Copyright @2026

Powered by Blink CMS