ఫోటో స్టోరి: బ‌్యాక్ బెండు తీసేస్తోందిగా..

Update: 2020-11-19 03:30 GMT
స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు.తొలుత స్వీడ‌న్ డ్రామా కంపెనీల్లో ప‌ని చేసింది. అక్క‌డే సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్క‌డ‌ టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్థిక్ పాండ్యాతో నిండా ప్రేమ‌లో మునిగి ఆ త‌ర్వాత అత‌డి నుంచి బ్రేక‌ప్ అయ్యింది. హార్థిక్ స‌డెన్ గా న‌టాషాని పెళ్లాడి బిగ్ షాకిచ్చాడు. అత‌డు ఇప్ప‌టికే ఓ బిడ్డ తండ్రి అయ్యాడు.

అదంతా స‌రే కానీ.. ఎల్లీ ప్ర‌స్తుతం సోలో లైఫ్ నే లీడ్ చేస్తోందా? అంటే.. త‌న‌కు న‌చ్చిన‌ట్టే సోష‌ల్ లైఫ్ తో కాల‌క్షేపం చేసేస్తోంద‌ట‌. దానికే ప్రిఫ‌ర్ చేస్తోంద‌ట‌. ఇక నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని త‌న చుట్టూ తిప్పుకుంటుంది. ప్ర‌స్తుతం మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది.

తాజాగా మ‌రో హాటెస్ట్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది ఈ స్వీడిష్ బ్యూటీ. ఆర్మీ స్టైల్ షార్ట్ లో వెన‌క వైపు తిరిగి థై సొగ‌సుల్ని ఒంపు సొంపుల్ని ఇదిగో ఇలా ఆవిష్క‌రిస్తూ కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు పుట్టిస్తోంది. ``రిమెంబ‌ర్ టు ల‌వ్ యువ‌ర్ సెల్ఫ్‌` అంటూ ఆక‌ర్ష‌ణీయ‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది. అవును.. త‌మ‌ను తాము ప్రేమించుకోవ‌డం చేత‌కాని వాళ్లు ఎవ‌రూ ఇలాంటి ఫోజులివ్వ‌లేరు మ‌రి!!
Tags:    

Similar News