ఫోటో స్టోరి: కొత్త యాంగిల్లో గూగ్లీ విసురుతోంది

Update: 2020-12-08 00:30 GMT
ఫోటోషూట్ల‌కు ఫోజులివ్వ‌డం కూడా ఒక ఆర్ట్. ఇదో క‌ళా ప్ర‌క్రియ‌. ఏం చేస్తే ఆడియెన్ ని టెంప్ట్ చేయ‌గ‌లం అన్న‌ది స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ సెలెక్ష‌న్. ఇక అందుకు త‌గ్గ‌ట్టు ఆర్టిస్టు లేదా మోడ‌ల్ కూడా ప‌ర్ఫామెన్స్ చూపించాలి. లేదంటే ఆ ఫోటోలో కిక్కుండ‌దు.

ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న విదేశీ ముద్దుగుమ్మ ఎల్లీ అవ్ రామ్ ఇందులో బ‌హు నేర్ప‌రి. ఫోటోషూట్ అంటే చాలు.. దుమార‌మే. నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో కుర్ర‌కారుకు అన్ లిమిటెడ్ ట్రీటివ్వ‌డం ఈ అమ్మ‌డికి కొత్తేమీ కాదు. ఇటీవ‌లే మాల్దీవుల విహారంలో బికినీ లో హీట్ పెంచింది.

తాజాగా మ‌రో కిల్ల‌ర్ బికినీని ఇన్ స్టాలో షేర్ చేసింది. వైట్ టాప్ .. బాట‌మ్ లో ఉందా లేదా అనిపించే ఇన్న‌ర్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది. సాగ‌రంలో ఊయ‌ల‌లూగుతూ కుర్ర‌కారు జీవితాల్ని గాల్లో ఊగిస‌లాడేలా చేసింది. ఎల్లీ ఈ లుక్ కి క్లీన్ బౌల్డ్ అయిపోవాలంతే. ఇంత‌కుముందు హార్ధిక్ పాండ్య క్లీన్ బౌల్డ్ అయినా కానీ అత‌డు చివ‌రిలో వేరొక భామ‌తో టేకాఫ్ అయిపోవ‌డంతో ఆ ప్రేమాయ‌ణం కాస్తా బెడిసికొట్టింది. అందుకే ఇప్పుడు ఒంట‌రి జీవితంలో స‌రికొత్త బౌన్స‌ర్ల‌తో చెల‌రేగిపోతోంది ఈ అమ్మ‌డు. ఎల్లీ న‌టించిన ప్యారిస్ ప్యారిస్ రిలీజ్ కి రావాల్సి ఉన్నా ర‌క‌ర‌కాల డిలేస్ అలానే క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది.
Tags:    

Similar News