బోల్డ్ గా వేడెక్కించే సీన్ల‌తో రెచ్చ‌గొడుతుంద‌ట‌

Update: 2020-10-12 07:15 GMT
ఇషారెబ్బా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌లి కాలంలో తెలుగ‌మ్మాయిల్లో పాపులారిటీ పెంచుకునేందుకు త‌పిస్తున్న బ్యూటీగా సుప‌రిచితం. అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్ట‌ర్లు చేస్తున్నా.. అప్పుడ‌ప్పుడు క‌థానాయిక‌గా అవ‌కాశం ఉన్న ఎంపిక‌ల‌తో దూసుకెళుతోంది. మ‌రోవైపు త‌న‌లోని నటిని బ‌య‌ట‌కు తీసేందుకు వెబ్ సిరీస్ ల‌కు సంత‌కాలు చేస్తోంది.

ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో ఇషా రెబ్బా న‌టిస్తోంది. హిందీ లస్ట్ ‌స్టోరీస్ కి రీమేక్ వెర్ష‌న్ ఇది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ‌సిరీస్‌ లో అత్యంత బోల్డ్ గా నటించి .. హిందీ వెర్ష‌న్ లో న‌టించిన కియారా ఆడ్వాణీని మ‌రిపించేస్తుంద‌ట‌.

కియ‌రాను మించి అడ‌ల్ట్ స‌న్నివేశాల్లో జీవించింద‌ని గుస‌గ‌స‌లు వినిపిస్తున్నాయి. సంకల్ప్ రెడ్డి ఈ ఎపిసోడ్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈషా ఏ రేంజ్ గ్లామర్ ఎలివేట్ చేయ‌నుంది అన్న‌ది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు త‌గ్గ‌ట్టే వేడెక్కించే  స్టిల్స్ ని రివీల్ చేస్తూ ఆటాడేస్తోంది ఈ తెలుగమ్మాయ్. ఇవి యూత్ లో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయిపోతున్నాయి. మ‌రోవైపు ఓ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీకి ఇషా రెబ్బా సంత‌కం చేయ‌నుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News