ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం జక్కన్న బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడా...?

Update: 2020-04-28 12:10 GMT
ప్రస్తుతం డైలీ ఏదొక అప్డేట్ తో వార్తల్లో ఉంటున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనివున్నాయి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్న ఆ సినిమాలో తారక్ 'కొమరం భీమ్' గా.. 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు చరణ్ ఇంట్రో వీడియో విడుదలయ్యాయి. 'అల్లూరి'గా రామ్ చరణ్ లుక్ చూసినప్పటి నుండి 'కొమరం భీమ్' గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న కోరిక సినీ అభిమానులకు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా జక్కన్న ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ఎలా చూపించబోతున్నాడో అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఫుటేజీ అందుబాటులో లేదు అనే వార్తలు రావడంతో తమ అభిమాన హీరో ఇంట్రో వీడియో వస్తుందో లేదో అనే భయం కూడా పట్టుకుంది అభిమానులకి. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగించేలా ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తయిందట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ సర్ ప్రైజ్ ఇవ్వటం కోసం రాజమౌళి లాక్ డౌన్ లో కూడా బాగానే కష్టపడుతున్నాడట.

కాగా ఇప్పటికే చరణ్ ఇంట్రో వీడియోకి తెలంగాణ యాసలో వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్.. ఆయన బర్త్ డే స్పెషల్ వీడియోలో పలికే డైలాగ్ లు ఎలా ఉంటాయనే కుతూహలం ఎక్కువైంది. ఈ సినిమాకు రచయిత బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. అయితే సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకూ షూట్ చేసిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంట్లోనే ఎడిట్ చేశారట. అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో ఐర్లాండ్‌ నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, ఒలివియా మోరిస్, ఐరిష్ నటి అలిసన్ డూడీ, బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి 'బాహుబలి' తర్వాత తీస్తున్న సినిమా కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.
Tags:    

Similar News