టీజర్ టాక్: అంతు చిక్కని ఎదురీత

Update: 2019-03-14 05:33 GMT
క్రైమ్ థ్రిల్లర్స్ కు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో దర్శకులు ఈ మధ్య కాలంలో వీటి మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆ కోవలో వస్తోందే ఎదురీత. దీని టీజర్ ఇందాక విడుదల చేశారు. ఓ యువకుడికి ఎన్నో సమస్యలు. ఎన్నో చిక్కుముడులు. వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక సతమతవుతు ఉంటాడు. ఆ క్రమంలో ఓ బడా బిజినెస్ మెన్ తో పరిచయం ఏర్పడుతుంది. అతని సహాయం కోరతాడు. కానీ ప్రతిదీ ఆచితూచి క్యాలికులేటెడ్ గా మాట్లాడే అతను హీరోను ఒక పద్మవ్యూహంలోకి దించుతాడు.

అదేంటి అతను ఎలా బయటికి వచ్చారు అసలు ఈ ఇద్దరికీ ఉన్న కనెక్షన్ ఏంటి అనేదే ఎదురీత కథగా కనిపిస్తోంది. టీజర్ ని వీలైనంత ఆసక్తి రేపెలా కట్ చేసే ప్రయత్నం గట్టిగా జరిగింది. లైన్ గురించి ఎక్కువ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా కట్ చేశారు. హీరో కన్నా ఇందులో కీలక పాత్ర పోషించిన సంపత్ ని చాలా ఎక్కువ హై లైట్ చేశారు. బహుశా కథ మొత్తం అతని మీదే ఉందేమో.

లీడ్ పెయిర్ శ్రవణ్ జియా శర్మలను ఎక్కువగా రివీల్ చేయకుండా కేవలం చెప్పదలుచుకున్న పాయింట్ ని మాత్రమే చూపించారు. మరీ గొప్పగా లేదు కానీ ఇలాంటి జానర్ మూవీస్ ని బాగా ఇష్టపడే వాళ్లకు ఓ ట్రై ఇవ్వొచ్చు అనేలా ఉంది.బాల మురుగన్ దర్శకత్వం వహించిన ఎదురీతకు అర్రోల్ కోరెల్లి సంగీతం అందించగా విజయ్ అర్పితరాజ్ ఛాయాగ్రహణం నిర్వహించారు


Full View

Tags:    

Similar News