దేవితో నాకు పోటీ నిజమే
టాలీవుడ్ లో ప్రస్తుతం థమన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. స్టార్ హీరోలకు.. పెద్ద బడ్జెట్ సినిమాలకు ఈయన మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కించుకున్న థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒక్కడిగా నిలిచాడు. యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు థమన్ పలువురికి ప్రస్తుతం వర్క్ చేస్తున్నాడు. థమన్ రాకతో తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ ప్రాభవం తగ్గిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మద్య పోటీ తీవ్రంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో థమన్ ఆ విషయమై స్పందించాడు. దేవిశ్రీ ప్రసాద్ తో తనకు పోటీ నిజమే. కాని అది వ్యక్తిగతంగా కాదు. ఆయనతో పోటీ పడ్డప్పుడు మాత్రమే నేను మంచి సంగీతాన్ని ఇవ్వగలను. అందుకే నేను అందరు దర్శకులతో పోటీ పడుతాను. ప్రతి ఒక్క సంగీత దర్శకుడు కూడా నాకు పోటీగా భావిస్తాను. అప్పుడే మంచి సంగీతాన్ని ప్రేక్షకులకు ఇవ్వగలను అనే నమ్మకం ఉందని ఈ సందర్బంగా థమన్ అన్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ తో నాకు మంచి స్నేహం ఉంది. అయినా కూడా ఆయన్ను నేను కాంపిటీటర్ గా చూస్తాను. ప్రతి సంగీత దర్శకుడు కూడా మరో సంగీత దర్శకుడికి పాంపిటీటర్ అవుతాడు అన్నాడు. థమన్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో కలిపి పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సౌత్ లో ప్రస్తుతం మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అనడంలో సందేహం లేదు. ఒకే సమయంలో చేతిలో పలు సినిమాలతో థమన్ ఇతరులతో పోల్చితే చాలా బిజీగా ఉన్నాడు.