#హిందీ ఛత్రపతి.. భయానికి మీనింగ్ తెలీదన్న బెల్లంకొండ
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పాత్రలో సాయి శ్రీనివాస్ ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దగా 2005లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డులకెక్కింది. ఛత్రపతిగా ప్రభాస్ నటనకు అభిమానులు జేజేలు పలికారు. ఇప్పుడు హిందీ రీమేక్ లో నటించి బెల్లంకొండ అంతటి స్టామినా చూపిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.
ఛత్రపతి హిందీ రీమేక్ కొన్ని వారాల క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ప్రవేశించడం గురించి ఓపెనయ్యాడు.
గతంలో తనకు నేరుగా హిందీ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని.. కానీ స్క్రిప్ట్స్ ఏవీ సంతృప్తికరంగా లేవని సాయి చెప్పారు. ``ఛత్రపతి కథ సరిగ్గా సరిపోయేలా అనిపించింది`` అని తెలిపారు. ముంబై దిల్లీ ప్రజలు తాను నటించిన సినిమాల హిందీ డబ్బింగుల్ని ఆదరించారని.. ఏడింట ఆరు సినిమాలు హిందీ బెల్టులో ఆదరణ దక్కించుకున్నాయని తెలిపారు. యూట్యూబ్ లో 200 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయని చెప్పారు.
ప్రభాస్ పోషించిన ఐకానిక్ పాత్రను పోషించాలన్న సాహసంపైనా మాట్లాడుతూ.. రెబల్ స్టార్ ప్రభాస్ పాత్రలో తాను నటించడం అస్సలు నెర్వస్ ఫీలవ్వడం లేదని అన్నారు. హిందీ వెర్షన్ స్క్రిప్ట్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మలిచే ప్రయత్నం సాగుతోందని ఆయన వెల్లడించారు. ``ఇది నా హిందీ కెరీర్ లో అతి భారీ తొలి అడుగు అయినందున నేను చాలా సంతోషంగా ఉన్నాను`` అని అతను చెప్పాడు.