కుక్కలని కూడా భయపెడతున్న సినిమా

Update: 2016-06-28 05:35 GMT
హారర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. భయపెట్టే సినిమా అని తెలిసి కూడా.. భయపడుతూనే చూసే జనాలు చాలా మందే ఉంటారు. కరెక్ట్ గా భయాన్ని తెరపై చూపించగలగితే.. హారర్ కి మించిన స్టార్ వాల్యూ వేరే ఏదీ అవసరం లేదు. రీసెంట్ గా హాలీవుడ్ లో వచ్చిన ది కంజూరింగ్2 మూవీ ఇలా ఆడియన్స్ ను భయపెట్టి సొమ్ము చేసుకోవడంలో బాగా సక్సెస్ అయింది.

రిలీజ్ అయిన అన్ని దేశాల్లోనూ కంజూరింగ్ 2 కు విపరీతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా పిక్చరైజ్ చేసి.. జనాలను భయపెట్టేసిందీ సినిమా. అయితే.. ఈ మూవీ మనుషులనే కాదు జంతువులను కూడా భయపెడుతోందిట. దెయ్యాలు గట్రా లాంటి వాటికి కుక్కలు, పిల్లలు భయపడవని.. ఎదిరించినట్లుగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ది కంజూరింగ్2 కుక్కలను కూడా భయపెట్టేస్తోంది.

ట్విట్టర్లో ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఓ ఇంట్లో ది కంజ్యూరింగ్ 2 మూవీని.. యజమానితో కలిసి ఓ కుక్క ఆసక్తిగా చూస్తోంది. అదే భయంకరమైన సీన్స్ వచ్చినపుడు మాత్రం సోఫా వెనక్కెళ్లి దాక్కుంటోంది. దెయ్యాలను భయపెట్టే కుక్కలుంటాయని తెలుసు కానీ.. దెయ్యం సినిమా సీన్ ని చూసి భయపడే కుక్కని ఇదే చూడ్డం అంటున్నారు నెటిజన్లు.
Full View

Tags:    

Similar News