వకీల్ సాబ్‌ః రికార్డింగ్ స్టూడియోలో పేపర్లు జల్లిన డైరెక్టర్
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. చిత్ర సంగీత దర్శకుడు థమన్ మరియు దర్శకుడు వేణు శ్రీరామ్ కలిసి మ్యూజిక్ ఫెస్ట్ తో సందడి చేస్తున్నారు. తాజాగా వీరు MLRITM కాలేజ్ లో ఫెస్ట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వేణు శ్రీరామ్ మాట్లాడుతున్న సమయంలో స్టూడెండ్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరుస్తూ ఉంటే సినిమా విడుదలై థియేటర్లలో మొదటి రోజు ఆట చూస్తున్నట్లుగా ఉందని అన్నాడు. వేణు శ్రీరామ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు అన్నప్పుడు థమన్ కల్పించుకుని ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.
సినిమా మొదటి సగం ఆర్‌ఆర్ పూర్తి అయ్యింది ఒక సారి చూసేందుకు రావాలంటూ పిలస్తే రికార్డింగ్ స్టూడియోకు వచ్చారు. సినిమా ను చూస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అలా ఎంట్రీ ఇస్తుంటే పది కేజీల పేపర్ ను చింపుకుని వచ్చి స్టూడియోలో జల్లాడు అంటూ థమన్ చెప్పుకొచ్చాడు. నేను మరియు వేణు ఇద్దరం కూడా పవన్ అభిమానులం. ఆయనతో వర్క్ చేయడం తో కల సాకారం అయ్యిందని సంతోషిస్తున్నాం అన్నాడు. ఒక అభిమాని పవన్ ను ఎలా చూడాలని అనుకుంటున్నాడో అలా ఈ సినిమాలో చూపించాడని కూడా థమన్ చెప్పుకొచ్చాడు. వకీల్ సాబ్ థియేటర్లలోకి వచ్చిన తర్వాత రచ్చ రచ్చే అంటూ థమన్ అంచనాలు మరింతగా పెంచాడు.
Full View