స్టార్ దర్శకుడిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2017-12-28 17:09 GMT
వెంకట్ ప్రభు.. తమిళంలో స్టార్ డైరెక్టర్. ‘సరోజ’.. ‘బిరియాని’.. ‘రాక్షసుడు’ లాంటి సినిమాలతో వెంకట్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. ఆ దర్శకుడిపై ఓ యంగ్ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ దర్శకుడు తన పాత్ర విషయంలో మోసం చేశాడని మనీషా యాదవ్ ఆరోపించింది. వెంకట్ ప్రభు చివరగా తీసిన ‘చెన్నై-28’లో మనీషా ఒక ఐటం గర్ల్ లాంటి పాత్ర చేసింది. ఆమె మీద ఒక పాట కూడా ఉంటుంది. ఐతే ఈ పాత్ర విషయంలో వెంకట్ ప్రభు తనకు చెప్పింది ఒకటి.. తీసింది ఒకటి అని ఆమె ఆరోపించింది. తనది కథలో కీలకమైన పాత్ర అని చెప్పాడని.. వెంకట్ ప్రభు లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో మంచి పాత్ర అనే సరికి మో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకున్నానని.. కానీ సినిమాలో తన పాత్రను ఆయన చాలా వల్గర్ గా చూపించారని ఆమె అంది.

ఈ చిత్రంలో తాను చేసే పాట తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని వెంకట్ ప్రభు అన్నారని.. కానీ తనను అంత చీప్ గా చూపిస్తారని ఊహించలేదని అంది. మనీషా ఇంతకుముందు రెండు మూడు సినిమాల్లో కథానాయికగా నటించింది. ‘త్రిష ఇల్లా నయనతార’ అనే సినిమాలో ఆమె హాట్ హాట్ గా కనిపించింది. మరి ఆ సినిమాలో అలా కనిపించిన మనీషా.. వెంకట్ ప్రభు సినిమా విషయంలో ఇలా ఫీలవడం కొంత వరకు ఆశ్చర్యం కలిగించే విషయమే. ఏదేమైనా తాను ఇకపై పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటానని.. పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోకుండా సినిమాలు ఒప్పుకోనని మనీషా అంది. తమిళంలో మనీషాకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేని మాట మాత్రం వాస్తవం.
Tags:    

Similar News