పవర్ స్టార్ ఫ్యాన్స్ ని కాకాపడుతున్న క్రిష్...!
ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనుల్లో ఆడవారికి సాయపడాలనే ఉద్దేశ్యంతో మొదలైన ఛాలెంజ్ టాలీవుడ్ ప్రముఖులకి ఒకరి తరువాత మరొకరికి చేరుతూ ముందుకు సాగుతోంది. 'అర్జున్ రెడ్డి డైరెక్టర్' సందీప్ రెడ్డి వంగా వినూత్నమైన ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ లో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పార్టిసిపేట్ చేస్తున్నారు. మొదటగా సందీప్ వంగా విసిరిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన రాజమౌళి.. ఈ ఛాలెంజ్ ని కొనసాగించాల్సిందిగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ - కీరవాణి - శోభు లకు పాస్ చేసాడు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ని ఈ నలుగురు పూర్తి చేసి మరికొందరికి ఈ సవాలును స్వీకరించమని నామినేట్ చేసారు. ఈ నేపథ్యంలో జక్కన్న విసిరిన సవాలును కంప్లీట్ చేసిన కీరవాణి.. ఈ ఛాలెంజ్ కి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిని నామినేట్ చేసాడు.
అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ విషయమై ఇంకాస్త వినూత్న ఆలోచన చేసిన క్రిష్.. దీన్ని సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. కీరవాణి విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్రిష్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేశారు. అందరిలా వేరే సెలబ్రిటినీ నామినేట్ చేయకుండా ఏకంగా పవన్ ఫ్యాన్స్ అందరికీ సవాల్ చేశారు. ఈ వీడియోలో గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఆ తరువాత తల్లికి ప్రేమగా పన్నీర్ టిక్కా చేసి పెట్టాడు క్రిష్. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 'కీరవాణి ఇచ్చిన సవాల్ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్వీకరించాలని కోరతున్నా. ఈ ఛాలెంజ్ ద్వారా ఇంటి పనులు చేసి తమ ఇళ్లలోని ఆడవారికి సాయపడాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు క్రిష్. ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్ ని ఎవరు నామినేట్ చేస్తారని ఎదురు చూసిన ఫాన్స్ ఇక వారే రియల్ మ్యాన్ అనిపించుకునేలా చేసాడు క్రిష్.
పవర్ స్టార్ ని ఛాలెంజ్ చేసినా ఆయన ఫ్యాన్స్ ని ఛాలెంజ్ చేసినా ఒకటే అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఆ సినిమాకు 'విరుపాక్ష' అనే టైటిల్ ని కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ కి పవన్ ఫ్యాన్స్ ని నామినేట్ చేయడం ద్వారా ఇప్పటి నుండే పవన్ అభిమానులను కాకా పడుతున్నాడంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తన సినిమాను ప్రమోట్ చేసుకునే ఆలోచనలో పవన్ ఫ్యాన్స్ ని ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ లో ఇన్వాల్వ్ చేయడం క్రిష్ టాలెంట్ కి నిదర్శనమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.