ఆ సూపర్ హిట్ 'సీక్వెల్' స్టోరీ చెప్పేసిన డైరెక్టర్!!

Update: 2020-07-07 09:10 GMT
2013లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా దృశ్యం. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అంతేగాక తెలుగు, తమిళ, హిందీ, సింహళీ, చైనీస్ భాషలలో రీమేక్ అయి మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా ప్రశంసలు మాత్రం దక్కాయి. కానీ ఒరిజినల్ మలయాళంలో మాత్రం 50 కోట్ల పైనే వసూల్ చేసింది. ఇందులో తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఒక సామాన్యుడి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి.. అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడనేది ఇందులో ముఖ్య కథాంశం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ మలయాళీ దృశ్యం సినిమాకు సీక్వెల్ రూపొందించడానికి ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నాడట. అదే దర్శకుడు జీతు జోసెఫ్ మోహన్ లాల్ తో దృశ్యం సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. ఇక ఈ సీక్వెల్ సినిమాలో మొదటి భాగంలో నటించిన మోహన్ లాల్, మీనాలే ప్రధాన పాత్రలలో నటించనున్నారు. మిగిలిన పాత్రలతో పాటు కథ కూడా మారిపోతుందని తెలుస్తుంది. మొదటి సినిమా తరహాలో ఇది కూడా ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలతో తెరకెక్కే థ్రిల్లర్ కథగానే ఉండబోతుందని సమాచారం. అయితే తాజాగా డైరెక్టర్ మాట్లాడుతూ.. "సీక్వెల్ పక్కా ఉంటుంది.

దృశ్యం సినిమా అక్క‌డితో ముగిసిందో, అక్క‌డ నుంచి సీక్వెల్ పార్ట్ కొన‌సాగుతుంది. ఫ‌స్ట్ పార్ట్ సినిమాలో కుర్రాడి మృత‌దేహాన్ని హీరో ఎక్క‌డ పూడ్చాడో ప్రేక్ష‌కుడికి క్లూ ఇచ్చి ముగించారు. ఆ కేసు పూర్తిగా క్లోజ్ చేయ‌లేద‌ని కొత్త‌గా వ‌చ్చిన పోలీసాఫీస‌ర్ హీరోకి చెబుతాడు. ఆ మేర‌కు విచార‌ణ కొన‌సాగుతుంద‌ని, సెకెండ్ పార్ట్ క‌థాంశం" అని ఆయన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్ మిగతా నటీనటులను త్వరలో ఎంపిక చేసే పనిలో ఉన్నాడట. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించి ఫినిష్ చేయాలనీ డైరెక్టర్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి దృశ్యం లాగే ఈ సీక్వెల్ విజయం అందుకుంటుందో లేదో చూడాలి.
Tags:    

Similar News