అల్లు హీరో షాకింగ్‌ నిర్ణయం

Update: 2020-03-11 04:54 GMT
వరుసగా ఫ్లాప్స్‌ పడ్డా కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే సత్తా.. బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న హీరో అల్లు శిరీష్‌. ఫ్లాప్స్‌ తో సంబంధం లేకుండా ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మించేందుకు కూడా దర్శక నిర్మాతలు ఆసక్తిగానే ఉంటారు. కాని ఆయన మాత్రం ఫ్లాప్స్‌ వస్తున్న కారణంగా కాస్త మెల్లగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. శిరీష్‌ కొత్త సినిమా కోసం ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. ఏ యంగ్‌ హీరో కూడా మరీ ఇంత గ్యాప్‌ తీసుకోడని శిరీష్‌ ఎందుకు ఇలా చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్‌ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు శిరీష్‌ ఒక తమిళ రీమేక్‌ ను చేసేందుకు సిద్దం అయ్యాడట. తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఒక చిన్న సినిమా రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకున్న ఆయన ఇప్పటికే దాన్ని తెలుగు నేటివిటీకి మార్చి స్క్రీన్‌ ప్లే రాయించాడట. తెలుగు స్క్రిప్ట్‌ రెడీ చేసింది మరెవ్వరో కాదు దర్శకుడు రాకేశ్‌ శశి. స్క్రిప్ట్‌ కు ఇంప్రెస్‌ అయిన అల్లు శిరీష్‌ దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రాకేశ్‌ శశి ఇప్పటి వరకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. జతకలిసే మరియు విజేత చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ దర్శకుడు రెండు సార్లు కూడా నిరాశ పర్చాడు. ముఖ్యంగా విజేత చిత్రంతో దారుణమైన ఫ్లాప్‌ ను మూట కట్టుకున్నాడు. మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేశాడు. ఇప్పుడు అదే దర్శకుడికి అల్లు శిరీష్‌ రీమేక్‌ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడట. రీమేక్‌ అంటే పెద్దగా క్రియేటివిటీ ఏమీ ఉండదు కనుక రాకేశ్‌ శశి ఉన్నంత లో బాగానే తెరకెక్కిస్తాడని మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ అనుకుంటున్నారు. కాని మెగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు మాత్రం శిరీష్‌ నిర్ణయానికి షాక్‌ అవుతున్నారు.
Tags:    

Similar News