అంతా అయిపోయాక త‌మ‌న్నా వ‌చ్చి ఏం లాభం?

Update: 2022-06-08 02:30 GMT
`భ‌ద్ర‌` మూవీలో సునీల్ చెప్పే డైలాగ్ ఒక‌టి గుర్తొస్తోంది. ఓ స‌న్నివేశంలో అంతా క్యార‌మ్ ఆడుతుంటారు. రెడ్ కైన్ ప‌డిపోతుంది. ఆ వెంట‌నే ర‌వితేజ వ‌స్తున్నా అంటూ వెళ‌తాడు. రెడ్ కైన్ ప‌డ్డాక వీడెళ్లి ఏం చేస్తాడ‌ని సునీల్ అంటాడు. స‌రిగ్గా `ఎఫ్ 3` సినిమాకు త‌మ‌న్నా ఇప్ప‌డు ప్ర‌చారం చేస్తుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చెప్ప‌డం అలానే వుంద‌ని అంతా కామెంట్ లు చేస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా న‌టించారు. స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించారు.

రీసెంట్  గా అంటే మే 27న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ కు ముందు విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, మెహ్రీన్‌, అనిల్ రావిపూడి, దిల్ రాజు.. సునీల్.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రు ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్నారు. ఒక్క త‌మ‌న్నా త‌ప్ప‌. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి త‌మ‌న్నాకు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డం వ‌ల్లే త‌ను ఈ మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

దీని పై దర్శ‌కుడు అనిల్ రావిపూడి వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. షూటింగ్ పూర్త‌యిన త‌రువాత రెండు గంట‌ల‌ పాటు సెట్ లోనే వుండాల‌న్నాన‌ని, అయితే త‌మ‌న్నా మాత్రం వ‌ర్క‌వుట్ లు చేయ‌డానికి ఆల‌స్య‌మ‌వుతుంద‌ని చెప్పి వెళ్లిపోయింద‌ని, ఆ త‌రువాత ఆ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రిగింద‌ని, అయితే అది ఆ త‌రువాత అంతా స‌ర్దుకుంద‌ని చెప్పాడు. అయితే త‌మ‌న్నా వేరే సినిమాల కార‌ణంగా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు.  

అయితే తాజాగా అనిల్ రావిపూడి చేసిన ప్ర‌క‌ట‌న ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. సినిమా విడుద‌లై రెండ‌వ వారం కూడా పూర్తి కాబోతున్న నేప‌థ్యంలో ఇప్ప‌డు త‌మ‌న్నా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటుంద‌ని చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇప్ప‌డు త‌మ‌న్నా వ‌చ్చి ప్రమోష‌న్స్ లో పాల్గొని ఏం లాభ‌మ‌ని కామెంట్ లు చేస్తున్నారు. కొంత మందైతే భ‌ద్ర సినిమాలోని సునీల్ - ర‌వితేజ ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశంలో సునీల్ చెప్పిన డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు.
Tags:    

Similar News