దిల్ రాజు ఇక‌పై అక్క‌డ పాగా వేయబోతున్నార‌ట‌!

Update: 2022-12-01 02:30 GMT
టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ల‌లో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న‌ నిర్మాత‌ దిల్ రాజు. క్రేజీ స్టార్ల‌తో వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూస‌ర్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆయ‌న ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో తొలి సారి త‌మిళ మూవీని నిర్మిస్తున్నారు. `వారీసు`గా తెర‌కెక్కుతున్నఈ సినిమాని వంశీ పైడిప‌ల్లి రూపొందిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని 2023 సంక్రాంతికి త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.  

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ విష‌యంతో పాటు థియేట‌ర్ల కేటాయింపు విష‌యంలోనూ ఈ సినిమాపై వివాదం చెల‌రేగింది. తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి డ‌బ్బింగ్ సినిమాల‌పై స్పందించ‌డం.. సంక్రాంతికి తెలుగు సినిమాల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం..దానిపై త‌మిళ నిర్మాత‌లు మండిప‌డ‌టం తెలిసిందే. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి కూడా త‌న‌దైన స్టైల్లో తెలుగు నిర్మాత‌ల మండ‌లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో `వార‌సుడు` వివాదం మ‌రింత‌గా ముదిరింది.

అయితే ఈ వివాదంపై దిల్ రాజు మాత్రం భిన్నంగా స్పందించ‌డం, మైత్రీ వారికి నాకు ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు లేవ‌ని, థియేట‌ర్ల స‌మ‌స్య మా మ‌ధ్య అస‌లే లేద‌ని, అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ వెన‌క ఎవ‌రున్నారో త‌న‌కు తెలుసున‌ని, వారి వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని సింపుల్ గా `వార‌సుడు` వివాదంపై స్పందించ‌డం విశేషం. ప్ర‌స్తుతం `వారీసు` ఫైన‌ల్ షూటింగ్ లో బిజీగా వున్న దిల్ రాజు ఈ మూవీని ఏ స్థాయిలో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ చేయాలో ప‌క్కా ప్లాన్ ని రెడీ చేసుకున్నాడు.

జ‌న‌వ‌రి 12నే ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో కీల‌క థియేట‌ర్ల‌ని లాక్ చేసి పెట్టిన దిల్ రాజు తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌పై డైరెక్ట్ గా వెల్ల‌డించిన ఇండ‌స్ట్రీలో ఆస‌క్త‌క‌ర చ‌ర్చ‌కు తెర లేపిన దిల్ రాజు బాలీవుడ్ లో పాగా వేయాల‌నుకుంటున్నార‌ట‌.
 
రీసెంట్ గా బాలీవుడ్ లోనూ త‌న స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నించి ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి `జెర్సీ` మూవీని రీమేక్ చేశాడు. ఇది అక్క‌డ ఫ్లాప్ గా మిగిలి షాకిచ్చింది. ఆ త‌రువాత `హిట్ ది ఫ‌స్ట్ కేస్‌`ని రాజ్ కుమార్ రావు హీరోగా టి సిరీస్ వారితో క‌లిసి రీమేక్ చేశాడు. ఇది కూడా డిజాస్ట‌ర్ అనిపించుకుంది. అయినా స‌రే మ‌ళ్లీ భారీ స్థాయిలో బాలీవుడ్ లో సినిమాలు చేస్తాన‌ని దిల్ రాజు చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. హిందీలో కొన్ని సినిమాలు పైప్ లైన్ లో వున్నాయ‌ని, బాలీవుడ్ కు చెందిన భారీ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి ఈ సినిమాలు చేయ‌బోతున్నాన‌ని దిల్ రాజు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News