• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసలైన 'రౌడీ బాయ్స్' దిల్...

అసలైన 'రౌడీ బాయ్స్' దిల్ రాజు - శిరీష్: విజయ్ దేవరకొండ

By - Tupaki Desk
Update: 2021-10-21 03:07 GMT
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో హీరోలుగా కొత్త కుర్రాళ్లు ఎక్కువగా పరిచయమవుతున్నారు. యువ దర్శకులతో కలిసి, కొత్త కంటెంట్ తో తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా 'రౌడీ బాయ్స్' సినిమా రూపొందింది. హర్ష కానుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మితమైంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, నిన్న రాత్రి సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ మాట్లాడాడు.

హర్ష .. ఆశిష్ .. అనూ .. వీళ్లందరితో ఏదో ఒక సందర్భంలో పరిచయం జరుగుతూ వచ్చింది. వాళ్ల కోసం టైమ్ స్పెండ్ చేశాను. ఏదో ఒక విధంగా నేను ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హర్ష 'పెళ్లి చూపులు' ముందు నుంచో .. ఆ తరువాత నుంచో నాకు తెలుసు. అప్పటి నుంచే కథలు చెప్పేవాడు. 'హుషారు' కథను కూడా నాకు చెప్పాడు. ఆయన కథలన్నీ నేను వింటూనే ఉంటాను. కాలేజ్ కుర్రడిలానే ఇప్పటికీ ఆలోచిస్తాడు. 'రౌడీ బాయ్స్'లో కూడా కాలేజ్ ఫీలింగ్స్ .. ఎమోషన్స్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతాయనేది నా సాలీడ్ ఫీలింగ్. 'హుషారు'తో హిట్ కొట్టిన హర్ష, ఈ సారి అంతకంటే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.

అనుపమ పరమామేశ్వరన్ ను ఉద్దేశించి .. "అనూ నువ్వు నాకు 'ప్రేమమ్' సినిమాలో 'మేరీ'లాగానే కనిపిస్తున్నావు. నువ్వు ఆ సినిమా చేసినప్పుడు మేమందరం పిల్లల్లా ఉండే. నీ యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా నువ్వు అలాగే చేసుంటావు. ఇక ఆశిష్ విషయానికి వస్తే, 'నాకు 'పెళ్లి చూపులు' గుర్తుండిపోయినట్టు, నీకు ఈ సినిమా గుర్తుండి పోవాలని కోరుకుంటున్నాను. ఆశిష్ లో నాకు చాలా సిన్సియారిటీ కనిపిస్తుంది. ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందు ఒకసారి వచ్చి కలిశాడు.

సినిమా గురించి .. యాక్టింగ్ గురించి ఆయనలో చాలా క్యూరియాసిటీ ఉండటం నేను అప్పుడు గమనించాను. ఆశిష్ ను ఉద్దేశించి .. "మీ బాబాయ్ .. మీ నాన్న మామూలోళ్లుగాదు. వాళ్లు ఎంతో కష్టపడి ఉంటే ఈ రోజున ఈ స్థాయికి వచ్చి ఉంటారు. వాళ్లు గర్వపడేలా నువ్వు చేస్తే చాలు. మా నాన్నలో కనిపించినట్టు .. మీ నాన్నలో కూడా నాకు టెన్షన్ కనపడుతోంది. ఇన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ లా కనిపించడం లేదు. వాళ్ల అంచలనకి తగినట్టుగా హార్డ్ వర్క్ చేయి .. గుడ్ లక్" అని చెప్పాడు.

ఆ తరువాత ఆడియన్స్ ను ఉద్దేశించి .. "ఈ రోజున మన రౌడీ బాయ్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మీరంతా నన్ను రౌడీ అని పిలుస్తారు .. ఇక్కడ ఇంకో కొత్త రౌడీ గ్యాంగ్ ఉంది. అసలైన ఆ ఇద్దరు రౌడీ బాయ్స్ గురించి ఇక్కడ మాట్లాడాలి. వాళ్లిద్దరూ ఎవరంటే రాజుగారు .. శిరీష్ అన్న. నిజామాబాద్ నుంచి వచ్చి నాన్ స్టాప్ ఫైటర్స్ లా పని చేస్తూ, ఈ రోజున ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఎప్పుడు కూడా వీళ్లు ఖాళీగా కనిపించరు .. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా ప్రొడక్షన్ హౌస్ ను తీసుకెళ్లాలని చూస్తున్నారు.

నాకు ఒకప్పుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్న్ లో ఒక చిన్న కేరక్టర్ అయినా చేయాలనే డ్రీమ్ ఉండేది. నేను ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు అక్కడ దిల్ రాజుగారిని చూశాను .. కానీ ఆయనతో మాట్లాడాలంటే నాకు ధైర్యం లేదు. ఇప్పుడు రాజు గారు నేను ఇద్దరం కూడా ఫిక్స్ అయ్యాం .. మైండ్ బ్లోయింగ్ మూవీ ఒకటి చేయాలని. అలాంటి కంటెంట్ పై వర్క్ చేస్తున్నాం .. 100 పర్సెంట్ అలాంటి సినిమానే దింపుతాం .. త్వరలో ఎనౌన్స్ చేస్తాం" అంటూ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నవంబర్ 19న వస్తున్న ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.


Tags:    
  • Dil Raju 
  • Rowdy boys 
  • Movie song launch 
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS