ఒక‌టి మ‌హేష్‌ కోసం..మ‌రొక‌టి ప‌వ‌న్‌ కోసం.?!

Update: 2015-09-10 05:09 GMT
చ‌క్క‌టి కుటుంబ క‌థ‌ల‌తో విలువ‌లున్న సినిమాలు తీస్తాడ‌నే పేరును సంపాదించుకొన్నాడు దిల్‌ రాజు. అందుకే తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ‌ల స‌ర‌స‌న దిల్‌ రాజుకి చెందిన శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిల‌బ‌డిపోయింది. పలువురు స్టార్ క‌థానాయ‌కులు ఇప్పుడు ఆ బ్యాన‌ర్‌ లో న‌టించేందుకు ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దిల్‌ రాజుతో  సినిమా చేయ‌డం ఓ గౌర‌వంగా భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ వేడుక‌లో `దిల్‌ రాజు నిర్మిస్తానంటే నా 151వ సినిమానే కాదు... 155వ‌ర‌కు ఆయ‌న సంస్థ‌లోనే సినిమాలు చేస్తా` అన్నాడు. అంటే ఆయ‌న నిర్మాణంపై  స్టార్ ల‌కు ఎంత న‌మ్మ‌కం పెరిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. వెంక‌టేష్‌, మ‌హేష్‌ బాబులాంటి అగ్ర క‌థానాయ‌కులు సైతం ఇప్ప‌టికే దిల్‌ రాజు సంస్థ‌లో న‌టించారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ కూడా ఓకే చెప్పేశాడ‌ట‌. అందుకే ఇప్పుడు దిల్‌ రాజు అగ్ర హీరోల‌తో సినిమాలు చేసేందుకు స‌న్నాహాలు చేసుకొంటున్నాడు. క‌థ‌ల్ని వింటూ వాటికి త‌గ్గట్టుగా అనిపించే టైటిళ్ల‌ని రిజిస్ట‌ర్ చేయించుకొంటూ బిజీ బిజీగా గ‌డుపుతున్నారు.

ఇటీవ‌లే తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లిలో దిల్‌ రాజు మూడు టైటిళ్ల‌ని రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌టి `జ‌న‌గ‌న‌మ‌ణ`, మ‌రొక‌టి `ఎవ‌డో ఒక‌డు`, ఇంకొక‌టేమో `సుప్రీం (ఏసీ/ డీటీఎస్‌)`. ఈ మూడు టైటిళ్ల గురించి తెలుసుకొని స్టార్ క‌థానాయ‌కుల అభిమానులు క‌ల‌ల్లో విహ‌రించ‌డం మొద‌లుపెట్టారు. `జ‌న‌గ‌ణ‌మ‌ణ‌` అనే టైటిల్ ప‌వ‌న్ కోస‌మే రిజిస్ట‌ర్ చేయించార‌ని  ఆయ‌న అభిమానులు మాట్లాడుకొంటున్నారు. అలాగే `ఎవ‌డో ఒక‌డు` టైటిల్ మ‌హేష్‌ కోస‌మ‌ని సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్‌ పెక్ట్ చేస్తున్నారు. `సుప్రీం` అనే టైటిల్ చిరంజీవి కోస‌మే అయ్యుండొచ్చ‌నేది మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ముగ్గురూ దిల్‌ రాజుతో సినిమాలు చేయ‌డానికి ఓకే అన్నారు కాబ‌ట్టి వాళ్ల‌కోస‌మే ఈ టైటిళ్లు రిజిస్ట‌ర్ చేయించార‌ని మాట్లాడుకొంటున్నారు జ‌నాలు. అందులో నిజం కూడా ఉండొచ్చు. అయితే ఏ టైటిల్ ఎవ‌రికి అనేది దిల్‌ రాజు అధికారికంగా వెల్ల‌డించాల్సి వుంది.
Tags:    

Similar News