మ‌న‌వ‌డికి ధోతి క‌ట్టించి దిల్ రాజు కోతిక‌మ్మ‌చ్చి

Update: 2021-07-08 11:50 GMT
టాలీవుడ్ స్థాయిని పెంచుతున్న నిర్మాత‌గా దిల్ రాజుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత‌టి వారే వ‌కీల్ సాబ్ వేదిక‌పై రాజుగారిని పొగిడారు. ప్ర‌స్తుతం శంక‌ర్ - చ‌ర‌ణ్ ల‌ను క‌లిపి సౌతిండ‌స్ట్రీలో మ‌రో లెవ‌ల్ పాన్ ఇండియా మూవీని నిర్మించేందుకు దిల్ రాజు స‌న్నాహ‌కాల్లో ఉండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇవేగాక ఏడాదికి మూడు నాలుగు ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాలు తెర‌కెక్కిస్తున్నారు. నిర్మాత‌గా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉండే దిల్ రాజు పంపిణీ రంగంలోనూ స్పీడ్ గానే ఉన్నారు. అయితే ఆయ‌న కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని నిరూపిస్తున్నారు. ఇటీవ‌ల కుటుంబ వేడుక‌లో రాజుగారి సంద‌డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

తన మనవడు ఆరన్ష్ `ధోతి` కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన దిల్ రాజు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుపు కుర్తా పైజామా ధరించి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో ఆయ‌న సంద‌డి చేశారు.

అంతేకాదు ధోతి క‌ట్టించి త‌న మ‌న‌వ‌డిని అలా భుజాల‌పైకి ఎత్తుకుని స‌రదాగా ఈవెంట్లో తిప్పారు. ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. క్యూట్ కిడ్ త‌న లైఫ్ ఆద్యంతం గుర్తుంచుకునే స్పెష‌ల్ మెమ‌రీగా ఈ ఈవెంట్ ని మ‌లిచార‌ని అర్థ‌మ‌వుతోంది. దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి ఈ వేడుక‌ల్లో సంద‌డి చేశారు.

కెరీర్ మ్యాట‌ర్స్ కి వ‌స్తే... సెకండ్ వేవ్ ఓవైపు.. ఏపీలో టిక్కెట్టు పాలిటిక్స్ ఇంకో వైపు వేడెక్కిస్తున్నా.. వ‌కీల్ సాబ్ ని ఎంతో డేరింగ్ గా థియేట్రిక‌ల్ రిలీజ్ చేశారు దిల్ రాజు. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన‌ది వ‌సూలు చేసింద‌ని దిల్ రాజు ఆనందం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ లాంటి స్టార్ తో సినిమా చేయాల‌న్న త‌న క‌ల నెర‌వేరినందుకు అది చాలనుకున్నాన‌ని దిల్ రాజు అన్నారు. త‌దుప‌రి రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ తో భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. అలాగే వెంకీ-వ‌రుణ్ ల‌తో ఎఫ్ 2 సీక్వెల్ ని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. హిందీలో జెర్సీ రీమేక్ ప‌నులు సాగుతున్నాయి. షూటింగ్ దాదాపు పూర్తయింది. ఏడాది చివ‌రిలో ఈ మూవీ రిలీజ‌వుతుంది.
Tags:    

Similar News