• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజు కుటుంబ హీరో...

దిల్ రాజు కుటుంబ హీరో ఆశిష్ డెబ్యూ లుక్

By - Tupaki Desk
Update: 2021-08-24 06:30 GMT
ప‌రిశ్ర‌మ‌లో న‌ట‌వార‌స‌త్వం (నెపోటిజం) అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశ‌మే. హీరోల వార‌సులు హీరోలు.. నిర్మాత‌లు ద‌ర్శ‌కుల వార‌సులు హీరోలే. చివ‌రికి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు విల‌న్ల వార‌సులు కూడా హీరోలుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ ట్రెండ్ అనాదిగా కొన‌సాగుతోంది. ఇక‌పోతే నెప్టోయిజం బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో ప‌రిమితం. ఇక్క‌డ ట్యాలెంట్ తో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలు ఉన్నారు. ప్ర‌తిభ ఉంటే అవ‌కాశాలిచ్చేందుకు అగ్ర  నిర్మాత‌లు వెన‌కాడ‌డం లేదు.

ఇక‌పోతే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి ఒక హీరో ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశిస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. అత‌డి పేరు ఆశిష్‌. దిల్ రాజు సోద‌రుడు శిరీష్ త‌న‌యుడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ `రౌడీ బాయ్స్` లో అత‌డు న‌టిస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఈ పోస్ట‌ర్ లో ఆశిష్ హీరోయిక్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. మంచి ఆకర్షణీయమైన రూపాన్ని అత‌డు కలిగి ఉన్నాడు.

త‌న ఏజ్ కి త‌గ్గ‌ట్టే `రౌడీ బాయ్స్` ఒక అందమైన కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అని తెలిసింది. విద్యార్థుల న‌డుమ వివాదాలు పోరాటాల‌తో ట్రెండీగా సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. క్యాంప‌స్ డ్రామా అన‌గానే 90ల‌లో వ‌చ్చిన‌ ప్రేమ‌దేశం - చెలి లాంటి క్లాసిక్ చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి. ఆశిష్ ను మ‌రీ ఆ రేంజులో ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారా? అన్న‌ది కాస్త ఆగితే కానీ తెలీదు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ హర్ష కనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. టాప్ కెమెరామెన్ మాది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రౌడీ బాయ్స్ ని దిల్ రాజు- శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ లో మూవీని విడుదల చేస్తార‌ని స‌మాచారం.
Tags:    
  • rowdy boys 
  • rowdy boys movie 
  • rowdy boys first look 
  • Ashish rowdy boys 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS