అలాంటోళ్లు సినిమాలు తీయొద్దంటున్న రాజు
ఈ రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదు.. వాటిని సరిగ్గా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడమే ముఖ్యం. ఈ సంగతే నొక్కి వక్కాణిస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం సినీ నిర్మాణం చాలా ప్రమాదకరంగా మారిందని.. సరైన అవగాహన లేకుండా సినిమా తీసే నిర్మాతలు కష్టాలు పడక తప్పదని.. అలాంటి వాళ్లు సినిమాలు తీయడం వృథా అని అంటున్నాడు రాజు. డబ్బులు పోయినా పర్లేదనుకునే నిర్మాతలు ఎందుకు సినిమాలు తీస్తారని ప్రశ్నించాడు రాజు. ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారడానికి కారణం నిర్మాతలే అని నిర్మొహమాటంగా చెప్పాడు రాజు. ఇంకా ఆయనేమంటున్నాడంటే..
''ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. మామూలు నిర్మాత చిన్న సినిమా తీస్తే ఆడదు. ఇది నా స్టేట్‌మెంట్. కథ బాగున్నా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగినపుడే ఏ సినిమా అయినా ఆడుతుంది. నేను కేరింత లాంటి చిన్న సినిమా తీశా. మంచి కథ. నేను పెద్ద నిర్మాత అయినా ఇబ్బందులు పడ్డాను. మరి ఇదే సినిమాను ఓ కొత్త నిర్మాత తీస్తే పరిస్థితి ఎలా ఉండేది? కొత్త నిర్మాతలు సినిమాలు తీయొద్దని నేననట్లేదు. నేను ఫ్యామిలీతో కలిసి టికెట్ కొనుక్కుని ఈ సినిమా చూడగలనా? అని ప్రశ్నించుకోండి.
సామాన్య ప్రేక్షకుల కోణం నుంచి ఆలోచించి సినిమాలు తీయాలి. చిత్ర నిర్మాణానికి సంబంధించి ప్రతి విషయంలోనూ అవగాహన ఉండాలి. రెండు కోట్లు పోయినా పర్లేదు సినిమా తీసేద్దాం అని కొందరనుకుంటుంటారు. అలాంటి వాళ్లు సినిమాలు తీయడం దేనికి? నిజానికి ఇలాంటి ధోరణి కలిగిన నిర్మాతల వల్లే మంచి సినిమాలు రావట్లేదు. ప్రస్తుతం నిర్మాతలంతా కాంబినేషన్‌లను నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు. పెద్ద హీరోతో సినిమా అనగానే ఎగ్జైట్‌మెంట్‌తో ప్రాజెక్టు కుదుర్చుకుంటారు. కానీ సినిమా నిర్మాణంలో, విడుదల ముందు ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించరు. సినిమా విడుదలయ్యే లోపు ఎలాంటి పరిస్థితైనా ఎదురు కావచ్చు. అది మన చేతిలో ఉండదు. అన్నీ అంచనా వేసి సినిమా తీసేవాడే ఇక్కడ బతికి బట్టకట్టగలడు'' అని రాజు చెప్పాడు.