ఫ్లాపుల‌న్నీ డిజిట‌ల్ వీక్ష‌ణ‌కు బెస్ట్

Update: 2020-01-15 01:30 GMT
డిజిట‌ల్ టాలీవుడ్ ని చ‌ప్ప‌రించేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలా వ‌చ్చిన సినిమాని అలా నెల‌రోజులు కూడా కాక‌ముందే డిజిట‌ల్ స్ట్రీమింగులో వీక్ష‌ణ‌కు అందుబాటులోకి తెచ్చేస్తుండ‌డంతో ఎగ్జిబిట‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ గంద‌ర‌గోళంలో ప‌డుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పంపిణీ వ‌ర్గాల్లో దీనిపై నిరంత‌ర చ‌ర్చ సాగుతోంది. నిర్మాత‌ల డ‌బుల్ గేమ్ వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం వాటిల్లుతోంద‌న్న ఆవేద‌న బ‌య్య‌ర్ల‌లో క‌నిపిస్తోంది.

అయినా ప‌ట్టించుకునే నాధుడే లేడాయే! అమెజాన్- నెట్ ఫ్లిక్స్- హాట్ స్టార్- జీ5 కాదేదీ డిజిట‌ల్ స్ట్రీమింగుకన‌ర్హం అన్న‌చందంగా ఇవ‌న్నీ తెలుగు సినిమాల్ని లైవ్ స్ట్రీమింగ్ చేసేస్తున్నాయి. కొత్త సినిమాల‌ డిజిట‌ల్ వీక్ష‌ణ‌కు ఆల్మోస్ట్ 8 కోట్ల తెలుగు జ‌నంలో స‌గం అల‌వాటు ప‌డిపోయార‌న్న రిపోర్ట్ అందుతోంది. ఇప్ప‌టికే 2019 క్రేజీ సినిమాల‌న్నీ డిజిట‌ల్ వీక్ష‌ణ‌కు అందుబాటులో ఉన్నాయి. సాహో- సైరా మొద‌లు అన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

ఇక‌పోతే తాజాగా ఓటీటీ వేదికపై ఒకేరోజు మూడు ఫ్లాప్ సినిమాలు అందుబాటులోకి వ‌చ్చేశాయి. తాజాగా కార్తికేయ 90ఎంఎల్- సుడిగాలి సుధీర్ - సాఫ్ట్ వేర్ సుధీర్ -శ్రీ‌నివాస‌రెడ్డి భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు చిత్రాలు లైవ్ స్ట్రీమింగుకి వ‌చ్చేశాయి. ఇవ‌న్నీ అమెజాన్ స్ట్రీమింగులో అందుబాటులో ఉండ‌డంతో సంక్రాంతి పండ‌గ‌ను జ‌నం ఇలా కూడా ఎంజాయ్ చేస్తున్నారు! ఈ స‌న్నివేశం చూస్తుంటే ఫ్లాపుల‌న్నీ ఇక్క‌డ చూడొచ్చు అన్న భావ‌న పెరిగిన‌ట్టేన‌ని అర్థం చేసుకోవాలి.

    

Tags:    

Similar News