• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐశ్వర్య నాకు 4సార్లు నో...

ఐశ్వర్య నాకు 4సార్లు నో చెప్పింది: సూపర్ స్టార్

By - Tupaki Desk
Update: 2020-04-29 08:30 GMT
ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్‌ పై అగ్ర స్థాయి కథానాయిక ఇమేజ్‌ దక్కించుకున్న అందాల భామ ఐశ్వర్య రాయ్‌. బాలీవుడ్‌ లో టాప్ స్టార్ గా ఎదిగిన ఈమె అడపాదడపా సౌత్ సినిమాల్లోనూ కనిపించింది. ప్రస్తుతం ఐశ్వర్య తనను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌' సినిమాలో నటిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన 'ఇద్దరు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఐష్‌. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఐశ్వర్యల కాంబినేషన్‌ పై ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రజినీకాంత్ ఐశ్వర్య కలిసి రోబో సినిమాలో నటించారు. అయితే అంతకు ముందు నాలుగు సినిమాల్లో రజనీకి జోడిగా ఐశ్వర్యను సంప్రదించారట.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్స్ నరసింహ, బాబా, చంద్రముఖి, శివాజీ సినిమాల్లో హీరోయిన్‌గా ముందు ఐశ్వర్య రాయ్‌నే సంప్రదించారు. అయితే ఐశ్వర్య మాత్రం ఆ సినిమాల్లో నటించేందుకు నో చెప్పింది. ఈ విషయంపై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `నాతో సినిమా అని దర్శకులు వస్తే ముందు వడివేలు డేట్స్‌ తీసుకోమని చెప్పేవాడిని. ఎందుకంటే ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్‌. ఆయన డేట్స్ కన్ఫమ్‌ అయిన తరువాత నా డేట్స్‌ ఓకే చేసేవాడిని. ఆ తరువాత ఐశ్వర్య రాయ్ చేస్తుందో లేదో కనుక్కొండి అని అడుగుతా.. ఎందుకంటే ఆమెతో డ్యూయట్‌ చేయాలని నేను భావించాను. ముందుగా ఆమెను నరసింహా సినిమాలో నీలాంభరి పాత్రకు సంప్రదించాను.

తర్వాత చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన పాత్రకు కూడా ముందుగా ఐశ్వర్యనే అనుకున్నాం. జ్యోతిక అప్పుడు ముంబైలో ఉండేది. ఆ పాత్రకు న్యాయం చేయగలదా అనే అనుమానం నాకు ఉండేది. కానీ డైరెక్టర్ పి. వాసు నమ్మకంతో ఆమెను తీసుకువచ్చాడు. ఆ నమ్మకాన్ని జ్యోతిక నిలబెట్టింది` అని చెప్పాడు రజనీ. నాలుగు సినిమాలు రిజెక్ట్ చేసిన తరువాత చివరగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో సినిమాలో నటించేందుకు అంగీకరించింది ఐశ్వర్య. కానీ ఆమెను తప్పుబట్టే అవసరం లేదు. ఎందుకంటే డేట్స్ అడ్జస్ట్ కాక చేయలేకపోయిందట. ఆఖరికి మా కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే" అంటూ సూపర్ స్టార్ తెలిపారు.
Tags:    
  • Did you know Aishwarya Rai rejected to work with Rajinikanth four times 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

Copyright @2026

Powered by Blink CMS