పూరి మ‌కాం ముంబైకి పూర్తిగా మార్చేసారా?

Update: 2022-07-27 01:30 GMT
డ్యాషిండ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ అడ్డా  ముంబైకి తాత్కాలికంగా మారిన సంగ‌తి తెలిసిందే. 'ఇస్మార్ట్' శంక‌ర్ త‌ర్వాత 'లైగ‌ర్' ప్ర‌క‌టించ‌డం నుంచి పూర్తిచేసేవ‌ర‌కూ  ముంబైలో ఉండే అన్ని ప‌నులు చూసారు. అవ‌స‌రం మేర హైద‌రాబాద్ లో కొన్ని షెడ్యూల్స్ మాత్ర‌మే చేసారు. త‌క్కిన భాగ‌మంతా షూటింగ్ ముంబైలోనే జ‌రిగింది. ఎన్న‌డు లేనిది ఈ సినిమా కోసం పూరి ముంబై స్టూడియోల్లో ప్ర‌త్యేకంగా సెట్లు  సైతం వేసి చేసారు.

తెలుగు -హిందీ భాష‌లు స‌హా పాన్ ఇండియా కేట‌గిరి సినిమా కావ‌డంతోనే పూరి ముంబైలో తిష్ట వేసి పూర్తి చేసారు. అటుపై 'లైగ‌ర్' హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ తోనే రెండ‌వ సినిమా 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'ని ప్రారంభించారు. ఈ చిత్రాన్ని కూడా రెండు భౄష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. పూరి క‌నెక్స్ట్ తో పాటు వంశీ పైడిప‌ల్లి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్త‌న్నారు. ఈ సినిమా కూడా ముంబైలో ప్రారంభం అయింది.

'లైగ‌ర్' భాగ‌స్వామ్యంలో క‌ర‌ణ్ జోహార ఉండ‌టంతో ముంబై త‌ప్ప‌నిస‌రి అయింది. మ‌రి ఇప్పుడు హిందీ నిర్మాత‌లు లేకున్నా పూరి ముంబైనే మ‌ళ్లీ అడ్డాగా ఎందుకు చేస‌కున్న‌ట్లు?  ఇలా వ‌రుస‌గా పూరి ముంబైలోనే  షూటింగ్ లు ప్రారంభించ‌డం వెనుక అంత‌రార్ధం ఏంటి?  మ‌కాం హైదరాబాద్ నుంచి ముంబైకి పూర్తిగా మార్చేసారా?  ఈ నేప‌థ్యంలోనే పూరి కుమారుడు ఆకాష్ సినిమా ఫంక్ష‌న్ కి సైతం ఢుమ్మా కొట్టారా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.
Read more!

పూరి ముంబైకి మకాం మార్చింది తాత్కాలికంగా కాక‌..శాశ్వ‌తంగానా? అన్న కొత్త కోణం ఇప్పుడిప్పుడే తెర‌పైకి వ‌స్తోంది.  ముంబైలో సొంతంగా ఓ ప్లాట్ కొనుగోలు చేసాడని..త‌న‌కి కావాల్సినవ‌న్నీ ఆ ప్లాట్ లోనే స‌మ‌కూర్చుకున్న‌ట్లు లీకులందుతున్నాయి. అయితే పూరి ఇలా ముంబైలో  ప్ర‌వైసీ కోరుకోవ‌డం వెనుక పెద్ద ప్లాన్ దాగి ఉంద‌ని ముంబై సోర్సెస్ చెబుతున్నాయి.

ఇక‌పై కంటున్యూస్ గా బాలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే ముంబైలో తిష్ట  వేసిన‌ట్లు..మ‌కాం హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చిన‌ట్లు వినిపిస్తుంది. పూరికేవ్ లో ఉన్న కొన్ని వ‌స్తువుల్ని ముంబై  ప్లాట్ కి షిప్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. అప్పుడ‌ప్పుడు హైద‌రాబాద్ లోని సొంతింటికి వ‌స్తున్నా ఒక‌టి..రెండు రోజులు ఉండి మ‌ళ్లీ తిరిగి ముంబై కి  ప‌య‌నం అవుతున్న‌ట్లు  స‌మాచారం.

అలాగే  స్ర్కిప్ట్ ప‌నులు కోసం కూడా వేరే దేశాల‌కు పెద్ద‌గా  వెళ్ల‌డం లేద‌ని...ముంబై లో ఉండే ఆ ప‌నులు పూర్తిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో వాస్త‌వాలు ఏంట‌న్న‌ది  తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News