రంగస్థలం కోసం దేవి ఫస్ట్ టైం అలా..

Update: 2018-03-17 17:30 GMT
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు కంపోజ్ చేసే పద్ధతి వేరుగా ఉండేది. ముందు పాట రాస్తే.. దానికి బాణీ కట్టేవాళ్లు. కానీ తర్వాత పద్ధతి మారింది. ముందు ట్యూన్ ఇస్తే.. దానికి తగ్గట్లుగా సాహిత్యం సమకూరుస్తున్నారు గీత రచయితలు. ఇప్పుడున్న సంగీత దర్శకులందరిదీ ఇదే శైలి. ఎప్పుడో అరుదుగా ఒకట్రెండు పాటల విషయంలో మాత్రం ముందు పాట రాయడం.. దానికి బాణీ సమకూర్చడం జరుగుతుంటుంది. ఐతే ‘రంగస్థలం’ విషయంలో మాత్రం దేవిశ్రీ పూర్తిగా రూటు మార్చేశాడట. ఎప్పుడూ బాణీ ఇచ్చి పాట రాయించే దేవి.. ఈసారి మాత్రం ముందు పాటలన్నీ రాయించి.. వాటికి బాణీలు కట్టాడట.

ఇలా ఒకటి రెండు పాటలకు కాదు.. ఆడియోలూ అన్ని పాటలకూ అలాగే జరిగిందట. ఈ చిత్రంలో అన్ని పాటలూ సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోసే రాసిన సంగతి తెలిసిందే. 80వ దశకం నేపథ్యంలో సినిమా కావడంతో అప్పటి పరిస్థితులకు తగ్గట్లు బోసే సరైన సాహిత్యం సమకూర్చగలడని.. ఆయనకే పూర్తి బాధ్యత అప్పగించారు. ఆయన తనదైన శైలిలో పాటలు రాసి మెప్పించాడు. ఇందులోని ప్రతి పాటనూ బోస్ 10-15 నిమిషాల్లో రాసేశారంటే ఆశ్చర్యపోవాల్సిందే అని.. ఆయన పాట రాశాకే అన్నింటికీ దేవి బాణీలు కట్టాడని.. తాను దేవితో ఎన్నో సినిమాలకు పని చేశానని.. ఇలా పాటలు రాశాక బాణీలు కట్టడం తన కెరీర్లో ఇదే తొలిసారని సుకుమారే స్వయంగా వెల్లడించాడు.
Tags:    

Similar News