ఫోటో స్టొరీ: శ్రీమతిగా దర్శనమిచ్చిన దీపిక

Update: 2018-11-20 11:27 GMT
జీవితం కొన్ని ముఖ్య సంఘటనలు ఎలా జరుగుతాయంటే డైలీ సీరియల్ లా రోజూ సాగుతూ ఉండవు.  ఒక నిముషంలోనో.. గంటలోనో.. ఒక రోజులోనో జరిగిపోతాయి. కానీ వాటి  ప్రభావం మాత్రం జీవితకాలం ఉంటుంది.  అలాంటివాటిలో పెళ్ళి ఒకటి.   దీపిక పదుకొనే - రణవీర్ సింగు లవ్వు స్టొరీ అందరికీ తెలిసిందే.  ఇప్పుడు దీప్-వీర్ లు పెళ్ళి చేసుకొని భార్యాభర్తలు గా మారిపోయారు.

ఇటలీ లోని లేక్ కోమో రిసార్టులో జరిగిన ఈ పెళ్ళిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అయింది. మొదట కొంకణీ సంప్రదాయంలోనూ.. తర్వాత సింధీ సంప్రదాయంలోనూ రెండు సార్లు పెళ్ళి చేసుకొని ఇద్దరూ ఒక్కటయ్యారు.  ఇక పెళ్ళి తర్వాత దీపిక తన మెడలో నల్లపూసలు(ఇక అదే మంగళసూత్రం అనుకోండి ) ధరించి దర్శనమివ్వడంతో ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది.  దీపిక తన తల కిందకు అలా ఒంచి ఉన్నప్పుడు ఈ ఫోటో తీయడంతో 'శ్రీమతి దీపిక' లుక్ వచ్చింది.  ఇక పెదవులపై అరనవ్వు ఆ చిరునవ్వు చెప్పకనే చెబుతున్నాయి.. సింగు గారి భార్య అయినందుకు ఆమె సంతోషంగా ఉందని.

అంతా బాగానే ఉంది గానీ అసలు రణవీరు సింగు గారు ఎక్కడున్నారో ఇంతకీ.  ఫోటో ఫ్రేమ్ కు బయట అయన ఏం చేస్తున్నట్టో. పొరపాటున దీపిక బ్యాగులు .. తన బ్యాగులు మోయలేక ఆపసోపాలు పడడం లేదు కదా.  అయినా సింగు భాయి బాగా బలంగానే ఉంటాడు. ఇబ్బంది లేదు!



Tags:    

Similar News