పుష్కర కాల ఎదురు చూపులకు తెరదించిన నాగీ

Update: 2020-07-20 06:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే ‘ప్రభాస్‌ 21’ చిత్రంలో నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. రాజుకు రాణిగా దీపిక పదుకునే అయితేనే బాగుంటుందని నాగ్‌ అశ్విన్‌ బలంగా నమ్మి ఈ చిత్రానికి ఆమెను ఎంపిక చేశాడు. దీపిక పదుకునే తెలుగులో నటించాలని ఆమె తెలుగు అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం దీపిక పదుకునేను ఒక తెలుగు సినిమాలో ప్రత్యేక సాంగ్‌ లో నటించింది. జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల కోసం ప్రత్యేక పాటలకు ఆమెను సంప్రదించారు. కాని సెట్‌ కాలేదు.

గత కొన్ని సంవత్సరాలుగా ఆమె క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. దాంతో ఆమెను మోసేంత సత్తా లేకపోవడంతో తెలుగు నిర్మాతలు ఆమెను కనీసం సంప్రదించేందుకు కూడా సాహసం చేయలేదు. ఎట్టకేలకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆమెను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందబోతున్న కారణంగా దీపిక ఈ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఆమెకు బాలీవుడ్‌ చిత్రాల కంటే కాస్త ఎక్కువగానే ఈ చిత్రంకు ముట్టబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

పద్మావత్‌ చిత్రంలో దీపిక పదుకునే నటన అద్బుతంగా ఉంటుంది. ఆ తరహా పాత్ర అవ్వడం వల్లే ప్రభాస్‌ మూవీ కోసం దీపిక పదుకునేను ఎంపిక చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. దీపిక పదుకునే ఈ చిత్రంకు కమిట్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. ప్రభాస్‌ స్టార్‌ డంకు దీపిక గ్లామర్‌ క్రేజ్‌ తోడు అయితే సినిమా బిజినెస్‌ స్టార్స్‌ ను అంటే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఏడాది చివరి నుండి షూటింగ్‌ ప్రారంభించేందుకు నాగ్‌ అశ్విన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Tags:    

Similar News