పురుషాధిక్యంపై ప‌గ‌బ‌ట్టిన ప‌ద్మావ‌త్ గురువుకే ఝ‌ల‌క్!

Update: 2021-08-09 14:35 GMT
బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే క్రేజ్ అసాధ‌ర‌ణం. హిందీ చిత్ర‌సీమ‌లో ఐశ్య‌ర్యారాయ్.. క‌రీనా క‌పూర్ త‌ర్వాత అంతటి పాపుల‌ర్ స్టార్ గా వెలిగిపోతోంది. ఇంకా చెప్పాలంటే  ఆ ఇద్ద‌రినీ మించిన‌ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తోంది. `రామ్ లీలా`- `బాజీరావ్ మ‌స్తానీ`-`ప‌ద్మావ‌త్` చిత్రాల‌తో దీపిక ఇమేజ్ అమాంతం పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్ల‌లోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ గా ఇప్ప‌టికే ఫోక‌స్ అయింది. తాజాగా దీపిక పురుషాధిక్య‌త‌పై ఉక్కు పాదం మోపుతోంద‌ని స‌మాచారం.

దీపిక ఇటీవ‌ల భారీ పారితోషికం డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్ హీరోల‌కు ధీటుగా త‌న‌కు కూడా పారితోషికం ఇవ్వాల్సిందేన‌ని  కండీష‌న్లు పెడుతోందిట‌. భార్యా భ‌ర్త‌లు ర‌ణ్ వీర్ సింగ్-దీపికా జంట‌గా సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రో భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ సినిమా నుంచి దీపికా ప‌దుకొణే త‌ప్పుకుంద‌న్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ని కుదిపేస్తోంది. కార‌ణం తెలిస్తే షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. కేవ‌లం పారితోషికం కార‌ణంగానే ఆ మెగా ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుందిట‌. ర‌ణ్ వీర్ సింగ్ కి ఎంత పారితోషికం ఇస్తున్నారో! అంతే పారితోషికం త‌న‌కు ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేసిందిట‌. త‌న‌ను స్టార్ హీరోయిన్ గా తీర్చిదిద్దిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌గ్గ‌రే ఈ విష‌యం ఖ‌రాకండీగా చెప్పేసిందిట‌. దీంతో స‌ద‌రు ద‌ర్శ‌కుడు  షాక్ అయి దీపిక కండీష‌న్ కు ఎంత మాత్రం ఒప్పుకునేది లేద‌ని.. ఆమెను కాక‌పోతే మ‌రో హీరోయిన్ పెట్టి సినిమా చేస్తాన‌ని స‌వాల్ విసిరిన‌ట్లు స‌మాచారం.

మొత్తానికి దీపిక ప‌దుకోణే స‌మాన‌త్వ ప్ర‌తిపాద‌న‌ను విర‌మించ‌డం లేద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. మగాళ్ల‌తో పాటు  ఆడ‌వాళ్లు అన్నింటి స‌మాన‌మేనంటూ దీపిక ఇక్క‌డ నుంచే మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీపిక ఎగ్జిట్ పై మ‌రో వెర్ష‌న్ కూడా వినిపిస్తోంది. కేవ‌లం ఆమె మానసిక విశ్రాంతి కోస‌మే ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని.. తాను ఫ్రెగ్నెంట్ అని కూడా మ‌రో వాద‌న వినిపిస్తోంది. కార‌ణాలు ఏవైనా  దీపిక పై మాత్రం నెగిటివ్ వైబ్స్ ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా మార్చిన భ‌న్సాలీకే ఝ‌ల‌కిచ్చింది అన్న విమ‌ర్శ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుంది. ఇక‌పోతే దీపిక మునుముందు నిర్మాత‌గా ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్టు కూడా చెబుతున్నారు.

దీపిక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలో న‌టిస్తోంది. ఈ మూవీతో పాటు అల్లు రామాయ‌ణం ఫ్రాంఛైజీలోనూ న‌టించ‌నుంది. వీటి కోసం భారీ పారితోషికాలు కావాల‌ని దీపిక ప‌ట్టుబ‌డుతోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక ప్ర‌భాస్ తో స‌మాన ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని ఇంత‌కుముందే దీపిక ఘ‌ర్ష‌ణ పడిన సంగ‌తి తెలిసిన‌దే. దానికి ప్ర‌భాస్ అభిమానులు నొచ్చుకుని సోష‌ల్ మీడియాల్లో ఘాటైన కామెంట్లు పెట్టారు. బ్యాన్ దీపిక అనే నినాదాన్ని కూడా కొంద‌రు అభిమానులు వైర‌ల్ చేయ‌డం అప్ప‌ట్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక దీపిక‌తో పాటు కంగ‌న -తాప్సీ లాంటి నాయిక‌లు స‌మాన పారితోషికాల అంశంపై బ‌హిరంగంగానే ఓపెన‌వుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News