హీరో కాపురంలో బోల్డ్ మూవీ చిచ్చు

Update: 2016-10-25 22:30 GMT
సినిమాల్లో సీన్లు చూసి అభిమానులు రెచ్చిపోవడం ఏమో కానీ.. గొడవలు ఇంటివరకూ వచ్చేస్తున్నాయ్. అభిమానులను ఆనందపరచడానికనే పేరు చెప్పి కోట్ల కొద్దీ కలెక్షన్స్ కొల్లగొట్టే ఐడియాతో బోల్డ్ మూవీలు బోలెడన్ని థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటిదే 'వజహ్ తుమ్ హో' అనే మూవీ కూడా. ఓ మర్డర్ ని లైవ్ లో టీవీలో టెలికాస్ట్ చేస్తే అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా.. ఇందులో సనాఖాన్-గుర్మీత్ చౌదరిలు వేడివేడిగా సన్నివేశాలను బెడ్ రూమ్ సీన్స్ ను పండించేసిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.

ఈ ట్రైలర్ ఇప్పుడు గుర్మీత్ ఇంట్లో చిచ్చు రేపిందని తెలుస్తోంది. తన మొగుడితో బెడ్ రూం సీన్లలోను సెక్స్ సీన్లలోనూ అంతగా రెచ్చిపోయిన సనాఖాన్ ని.. గుర్మీత్ చౌదరి భార్య దేవినా చౌదరి నానా తిట్లు తిట్టేస్తోంది. ట్రైలర్ చూసిన వెంటనే మొగుడికి ఫోన్ చేసి మరీ వార్నింగులు ఇచ్చేసిందట. దీంతో షాక్ తిన్న గుర్మీత్.. అదంతా యాక్టింగే అని చెప్పి ఆమెను శాంతపరించేందుకు ప్రయత్నించాడట. ఇక చెప్పేది వినకపోవడంతో.. గోవాకు సర్ ప్రైజ్ ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసి.. అక్కడ బతిమాలుడుకున్నాడట.

సినిమాలు చాలా రకాల సమస్యలు సృష్టించాయనే విషయం తెలుసు కానీ.. బోల్డ్ మూవీస్ లో నటించేవాళ్లంతా ముందుగానే వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వజహ్ తుమ్ హో ఆ టైపు సినిమా అయుండి కూడా.. ఇలాంటి సమస్య రావడం మాత్రం ఇదే ఫస్ట్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News