• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'డియర్ మేఘ' టీజర్:...

'డియర్ మేఘ' టీజర్: భావోద్వేగాలు కలబోసిన అందమైన ఆసక్తికరమైన ప్రేమకథ

By - Tupaki Desk
Update: 2021-07-22 05:50 GMT
మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం ''డియర్ మేఘ''. సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ - ఇతర పోస్టర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే 'ఆమని ఉంటే పక్కన' లిరికల్ సాంగ్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డియర్ మేఘ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'హాయ్.. నేను మేఘ స్వరూప్. నాకు లవ్ లో పీహెడ్డీ ఉంది' అంటూ మేఘా ఆకాష్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనుకునే విధంగా ఈ టీజర్ కట్ చేశారు. అలానే ఇది కన్నడ హిట్ సినిమా 'దియా' రీమేక్ అనే సందేహం కలుగుతోంది. 'కాలేజీలో ఉన్నప్పుడు ఒక్కసారైనా నన్ను చూసావా?' అని హీరో అడుగగా.. 'నిన్ను చూసినన్ని సార్లు బుక్స్ చూసి ఉంటే కాలేజ్ టాపర్ అయ్యుండే దాన్ని' అని హీరోయిన్ నుంచి సమాధానం వస్తుంది.

'లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకడం కాదు.. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బ్రతకడం' 'అతి ఎక్కువ సంతోషానికైనా బాధకైనా కారణం ప్రేమే అవుతుంది' వంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. 'స్టోరీలకు ముగింపు ఉంటుంది.. లవ్ స్టోరీలను ఉండదు' అని చెబుతున్న 'డియర్ మేఘ' టీజర్ అలరిస్తోంది. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం సమకూర్చారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.

'డియర్ మేఘ' చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. భావోద్వేగాలు కలబోసిన ఈ అందమైన ఆసక్తికరమైన ప్రేమకథ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.




Full View

Tags:    
  • dear megha 
  • dear megha teaser 
  • dear megha teaser talk 
  • megha akash dear megha 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS